IRCTC QUIZ: ఐఆర్‌సిటిసి ప్రశ్నకు ఆన్సర్ చెప్పగలరా ? ట్రై చేయండి

IRCTC QUIZ: భారతీయ రైల్వే ప్రయాణికులను ( IRCTC ) ఆసక్తికరమైన ప్రశ్న అడిగింది. చాలా మంది దీనికి సరైన సమాధానం చెప్పారు. మీరు కూడా ట్రై చేయండి. లాక్‌డౌన్ సమయంలో భారతీయ రైల్వే ప్రయాణికులకు సూచనలు చేయడంతో పాటు వారికి ఎప్పటికప్పుడు ప్రయాణానికి సంబంధించిన తాజా సమాచారాన్ని షేర్ చేస్తోంది.

Last Updated : Jun 27, 2020, 11:26 PM IST
IRCTC QUIZ: ఐఆర్‌సిటిసి ప్రశ్నకు ఆన్సర్ చెప్పగలరా ? ట్రై చేయండి

IRCTC QUIZ: భారతీయ రైల్వే ప్రయాణికులను ( IRCTC ) ఆసక్తికరమైన ప్రశ్న అడిగింది. చాలా మంది దీనికి సరైన సమాధానం చెప్పారు. మీరు కూడా ట్రై చేయండి. లాక్‌డౌన్ సమయంలో భారతీయ రైల్వే ప్రయాణికులకు సూచనలు చేయడంతో పాటు వారికి ఎప్పటికప్పుడు ప్రయాణానికి సంబంధించిన తాజా సమాచారాన్ని షేర్ చేస్తోంది. అయితే ప్రయాణికులకు కాస్త ఆహ్లాదాన్ని కలిగించడానికి కొన్ని ప్రముఖ చారిత్రక కట్టడాల ( Monuments) గురించి ఒక క్విజ్‌ను పెట్టింది. 

ఐఆర్‌సిటిసి తన అఫిషియల్ ట్విట్టర్ హ్యండిల్‌లో "ఏటూజెడ్ఆఫ్ఇండియాట్రావెల్ ( AToZOfindiTravel ) అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీ సమాధానం కామెంట్ బాక్స్‌లో చెప్పండి" అని ట్వీట్ చేసింది. ఐఆర్‌సిటిసి ఒక స్మారక స్థూపాన్ని షేర్ చేసి దాన్ని గుర్తించాల్సిందిగా నెటిజెన్స్‌ని ప్రశ్నించింది. దీని కోసం అక్కడ నాలుగు ఆప్షన్లు కూడా ఇచ్చింది.

 

ఈ ప్రశ్నకు పలువురు సమాధానం కూడా చెప్పారు. కొంతమంది ఈ  స్తూపం గురించి మాట్లాడుతూ.. దాన్ని పలుసార్లు చూశామని.. చాలా బాగుంటుంది అని తెలిపారు.

సరైన సమాధానం ఇదే..

ఐఆర్‌సిటిసి అడిగిన ఈ ప్రశ్నకు సరైన సమాధానం B అంటే విక్టరీ టవర్ చిత్తోడ్‌ఘడ్ ( Victory Tower Chittorgarh ). గతంలో కూడా ఐఆర్‌సిటిసి చరిత్రకు సంబంధించిన పలు క్విజ్‌లు నిర్వహించింది.

Trending News