Teacher accused of taking upskirt videos: సింగపూర్: స్కూల్ స్టూడెంట్స్‌కి పాఠాలు చెప్పాల్సిన టీచర్.. అంతటితో ఊరుకోకుండా వక్ర బుద్దితో ఆలోచించాడు. అదే స్కూల్లో అప్స్కర్ట్లో ఉన్న మహిళల వీడియోలు ( Upskirt videos ) రికార్డు చేసి పోలీసుల చేతిలో బుక్కయ్యాడు. బాధితులంతా అదే స్కూల్లో పనిచేస్తోన్న అతడి తోటి సిబ్బందే కావడం గమనార్హం. అలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 168 వీడియోలు చిత్రీకరించినట్టు ( recording upskirt videos of women ) అతడిపై పోలీసు కేసు నమోదైంది. 2015 ఏప్రిల్ నుంచి 2018 జూలై మధ్య కాలంలో అతడు ఈ నేరాలకు పాల్పడినట్టు పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. మహిళలను కించపర్చే విధంగా వ్యవహరించడంతో పాటు వారి పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేందుకు కారకుడయ్యాడని పోలీసులు అతడిపై అభియోగాలు నమోదు చేశారు. మహిళలను అర్ధ నగ్నంగా, అశ్లీలంగా చూపించే ప్రయత్నం చేయడాన్ని, మహిళల అర్దనగ్న వీడియోలు కలిగి ఉండటాన్ని ( obscene films ) తీవ్రంగా పరిగణించిన కోర్టు అతడిపై విచారణ చేపట్టింది. ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తెచ్చిన ఈ ఘటన సింగపూర్‌లో చోటుచేసుకుంది. 2018లోనే విధుల నుంచి సస్పెండ్ అయిన ఈ స్కూల్ టీచర్‌పై కోర్టు విచారణ తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది.
విదేశాల్లో మినీస్కర్ట్స్ ( Mini skirts ) ధరించడం అనేది సర్వ సాధారణమైన ఫ్యాషన్ అనే సంగతి అందరికీ తెలిసిందే. అలా స్కర్ట్స్ ధరించడం అనేది వారికి సాధారణం అయితే.. ఆ మహిళలకు తెలియకుండా వారి వీడియోలు, ఫోటోలు రికార్డు చేసి రాక్షసానందం పొందడం కూడా ఈ టీచర్‌కి అంతే సాధారణమైంది. సింగపూర్ పోలీసుల వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు అలా అతడి బాధితుల జాబితాలో 69 మంది మహిళలు ఉన్నట్టు తేలింది. వారిలో చాలామందిని వివిధ సందర్భాల్లో స్కర్ట్‌లో ఉండగా ఈ టీచర్ తన మొబైల్ కెమెరాలో బంధించాడు.
టీచర్ వక్రబుద్దికి బాధితులైన మహిళల పేర్లు, వివరాలు బహిర్గతం కాకూడదనే ఉద్దేశంతో సింగపూర్ కోర్టు అతడి వివరాలు సైతం వెల్లడించలేదు. సింగపూర్ విద్యా శాఖ అధికార ప్రతినిధి ఈ ఘటనపై స్పందిస్తూ.. మహిళల పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యవహరించినందుకుగాను ఆ స్కూల్ టీచర్‌కి చట్టరీత్యా తగిన శిక్ష పడే వరకు విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. సింగపూర్ చట్టాల ప్రకారం అతడు ఒక్క మహిళను వేధించినట్టు నిరూపణ అయినా.. అతడికి ఏడాది జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశం ఉంది. ఒక్కో సందర్భంలోనూ జైలు శిక్ష, జరిమానా.. రెండూ విధించే అవకాశం ఉంది. అయితే ఈ ఘటనలో అతడి బాధితుల జాబితా పదుల సంఖ్యలో ఉంది కనుక సింగపూర్ కోర్టు అతడికి ఏం శిక్ష విధిస్తుందనేదే వేచిచూడాల్సిందే. హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..