Haryana Earthquake: ఉత్తర భారత దేశాన్ని వరుస భూకంపాలు ( Earthquakes ) వణికిస్తున్నాయి. తాజాగా హరియాణాలోని రోహ్తక్ ( Haryana Earthquake )లో భూకంపం సంభవించింది. 3.32 నిమిషాలకు ఈ భూకంపం సంభవించగా.. రిక్టర్ స్కేలుపై ( Richter Scale ) దీని తీవ్రత 2.8 గా నమోదు అయింది.
ఉత్తర భారత దేశాన్ని వరుస భూ ప్రకంపణలు భయపెడుతున్నాయి. గత కొంత కాలంగా డిల్లీ, ఉత్తర్ ప్రదేశ్లో స్వల్ప తీవ్రత గల ప్రకంపణలు సర్వసాధారణం అయ్యాయి. తాజాగా హరియాణలోని రోహ్తక్లో 2.8 తీవ్రత గల భూకంపం సంభవించింది. అదృష్టవశాత్తుగా భూకంపం తీవ్రత స్వల్పమైనది కావడంతో
ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం చోటుచేసుకోలేదు.