India Vs China | తూర్పు లడాఖ్‌లోని గాల్వన్ లోయ(Galwan Valley)లో మంగళవారం చైనా దొంగదెబ్బ తీయడంతో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఇందులో తెలుగు వ్యక్తి, సూర్యాపేట జిల్లాకు కల్నల్ సంతోష్ బాబు ఉన్నారని తెలిసిందే. అయితే గాల్వన్ లోయలో ధైర్యసాహసాలు ప్రదర్శించి దేశం కోసం అమరులైన జవాన్ల పేర్లను, వారి హోదా, ఏ ప్రాంతానికి చెందిన వారన్న వివరాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. భారత సైనికులు సైతం కాల్పులను తిప్పికొట్టడంతో దాదాపు 35 మంది చైనా సైనికులు(China Soldiers) చనిపోయారని కథనాలు వస్తున్నాయి. అయితే చైనా మాత్రం దీనిపై స్పందించడం లేదు.
గాల్వన్ లోయలో అమరులైన జవాన్లు... (Galwan Valley Martyred Indian Army Soldiers)
1. బి. సంతోష్ బాబు (కల్నల్) - సూర్యాపేట, తెలంగాణ
2. నాధూరం సోరెన్ (నాయిబ్ సుబేదార్) - మయూర్ బంజ్, ఒడిశా
3. మన్దీప్ సింగ్ (నాయిబ్ సుబేదార్) - పాటియాలా, పంజాబ్
4. సత్నమ్ సింగ్ (నాయిబ్ సుబేదార్) - గురుదాస్‌పూర్, పంజాబ్
5. కె.పళని (హవిల్దార్) - మధురై, తమిళనాడు
6. సునిల్ కుమార్ (హవిల్దార్) - పాట్నా, బిహార్
7. బిపుల్ రాయ్ (హవిల్దార్) - మీరట్, ఉత్తర్‌ప్రదేశ్
8. దీపక్ కుమార్ (సిపాయి) - రీవా, మధ్యప్రదేశ్
9. రాజేష్ అరంగ్ (సిపాయి) - బిర్భుమ్, పశ్చిమ బెంగాల్
10. కుందన్ కుమార్ ఓజా (సిపాయి) - సాహిబ్ గంజ్, జార్ఖండ్
11. గణేష్ రామ్ (సిపాయి) - కాంకేర్, ఛత్తీస్‌గఢ్
12. చంద్రకాంత ప్రధాన్ (సిపాయి) - కందమాల్, ఒడిశా
13. అంకుశ్ (సిపాయి) - హమిర్పూర్, హిమాచల్ ప్రదేశ్
14. గుర్విందర్ (సిపాయి) - సంగ్రూర్, పంజాబ్
15. గుర్ తేజ్ సింగ్ (సిపాయి) - మాన్నా, పంజాబ్
16. చందన్ కుమార్ (సిపాయి) - భోజ్‌పూర్, బిహార్
17. కుందన్ కుమార్ (సిపాయి) - సహస్ర, బిహార్
18. అమన్ కుమార్ (సిపాయి) - సమస్తిపూర్, బిహార్
19. జై కిశోర్ సింగ్ (సిపాయి) - వైశాలి, బిహార్
20. గణేష్ హన్స్డా (సిపాయి) - తూర్పు సింగ్భమ్, జార్ఖండ్
సూర్యాపేట దగ్గరలోని కేసారంలో కల్నల్ కుటుంబం పేరిట ఉన్న అరఎకరం స్థలంలో సంతోష్ అంత్యక్రియలకు జిల్లా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. రేపు కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియల్ని అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ