Coronavirus in AP | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో గుర్తించిన కరోనావైరస్ పాజిటివ్ కేసుల వివరాలపై ఏపీ సర్కార్ తాజా హెల్త్ బులెటిన్ విడుదల ( Health bulletin) చేసింది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి ఇవాళ ఉదయం 9 గంటల వరకు మొత్తం 15,911 బ్లడ్ శాంపిల్స్‌పై కోవిడ్-19 పరీక్షలు ( COVID-19 tests) జరపగా.. అందులో 193 మందికి కరోనావైరస్ పాజిటివ్ అని నిర్థారణ అయినట్టు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ఈ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. దీంతో ఇప్పటివరకు ఏపీలో కరోనా సోకిన వారి సంఖ్య మొత్తం 5280కి చేరింది. విదేశాల నుంచి వచ్చిన వారిలో 237 మందికి కరోనా రాగా వారిలో ప్రస్తుతం 214 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 1203 మందికి కరోనా సోకగా.. ప్రస్తుతం 564 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ( ఉచిత కరోనా పరీక్షలు ప్రారంభం )
కరోనాతో గత 24 గంటల్లో ఇద్దరు చనిపోయారు. వారిలో ఒకరిది చిత్తూరు జిల్లా కాగా మరొకరిని ప్రకాశం జిల్లా వాసులుగా గుర్తించారు. దీంతో ఇప్పటివరకు కరోనా సోకి మృతి చెందిన వారి సంఖ్య 88కి చేరింది ( COVID-19 deaths in AP). ప్రస్తుతం ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా 2341 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..