/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

చాలా కూరలలో కొత్తిమీరను వాడతారు. కొందరు కొత్తమీరతో రుచికరమైన పచ్చడి కూడా చేస్తారు. ధనియాల మొక్కలే ఈ కొత్తిమీర. సువాసన కలిగి ఉండే కొత్తిమీరను కూరలలో ఎందుకు వాడతారు, వాటి ప్రయోజనాలేంటో (Benefits of Coriander) ఇప్పటి జనరేషన్ వారికి అంతగా తెలియదు. కేవలం తమ వంటకం (Recipe)  అట్రాక్టివ్‌గా, వాసన వెదజల్లేందుకు వాడతారని అనుకుంటారు. దీని శాస్త్రీయ నామము Coriandrum Sativum. కొత్తిమీరలో విటమిన్లు, ఖనిజ లవణాలు ఉన్నాయి. కొత్తిమీర తింటే ఐరన్ కుడా లభిస్తుంది. లాక్‌డౌన్‌లో బరువు పెరిగారా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి

కొత్తిమీర వల్ల కలిగే ప్రయోజనాలు (Health Benefits of Coriander)

  • రక్తంలో చక్కెర స్థాయి అధికంగా ఉంటే టైప్ 2 మధుమేహం (డయాబెటిస్) వస్తుంది. కొత్తిమీర తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది, నియంత్రిస్తుంది. ఎంజైమ్‌ల పనితీరు మెరుగు చేసి రక్తంలో చక్కెరను నియంత్రించి, తద్వారా మనల్ని షుగర్ వ్యాధి (Diabetes) బారిన పడకుండా తోడ్పడుతుంది.
  • జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. ధనియాల నుంచి తీసే నూనె జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. తరచుగా అసహనానికి గురయ్యేవారి సమస్యకు కొత్తమీర (Coriander Uses) చెక్ పెడుతుంది.
  • గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. రోజూ కొత్తిమీర తినడం వల్ల అధిక రక్తపోటు (High Blood Pressure)ను, చెడు కొవ్వును తగ్గించి గుండె పనితీరు మెరుగు పరుగుస్తుంది. ఉదయాన్నే నిమ్మరసం తాగుతున్నారా.. ఇది తెలుసుకోండి
  • కొత్తిమీరలో ఉంటే యాంటీ ఆక్సిడెంట్స్ మెదడుపై ఒత్తిడిని తగ్గించడంతో పాటు జ్ఞాపకశక్తిని పెంచుతాయి. త్వరగా ఒత్తిడి, ఆందోళన చెందడాన్ని అదుపుచేస్తుంది. 
  • Coriander రక్తహీనతను తగ్గిస్తుంది. పొగతాగడం, కీమోథెరపి వల్ల కలిగే నష్టాలను తగ్గిస్తుంది. రక్తనాళాలలో ఆటంకాలను తొలగించి రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. 
  • ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కొత్తిమీర (Coriander Benefits) కాపాడుతుంది. కొత్తమీర తరచుగా తింటే బ్యాక్టీరియాల ఇన్‌ఫెక్షన్‌ సమస్య మటుమాయం.  తొడలు లావుగా ఉన్నాయా.. అయితే మీకు శుభవార్త
  • రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. కొత్తిమీరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరితిత్తులు, ప్రొస్టేట్, బ్రెస్ట్ (ఛాతీ) భాగాలలో క్యాన్సర్ కణాలు త్వరగా పెరగకుండా నియంత్రిస్తుంది. కొత్తిమీర కొన్ని రకాల క్యాన్సర్లను నివారిస్తుంది.
  • చర్మ సంరక్షణలోనూ కొత్తిమీర కీలకపాత్ర పోషిస్తుంది. ఎండలో ఎక్కువగా తిరిగేవారి శరీరాన్ని ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతుంది.
  • చాలా రకాల వంటలలో కొత్తిమీర వాడతారు. దీనివల్ల కూరలు రుచికరంగానూ, సువాసన వెదజల్లుతాయి. వంటలకు కొత్తిమీర కొత్తదనాన్నిస్తుంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
    మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ
Section: 
English Title: 
Health Benefits of Coriander Leaves; Uses of Coriander
News Source: 
Home Title: 

కొత్తిమీర అని తీసి పారేయొద్దు.. ఈ ప్రయోజనాలు తెలుసా!

కొత్తిమీర అని తీసి పారేయొద్దు.. ఈ ప్రయోజనాలు తెలుసా!
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
కొత్తిమీర అని తీసి పారేయొద్దు.. ఈ ప్రయోజనాలు తెలుసా!
Shankar Dukanam
Publish Later: 
No
Publish At: 
Monday, June 15, 2020 - 15:56