కొనసాగుతున్న జూడాల సమ్మె...

గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ల ఆందోళన కొనసాగుతోంది. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు సమ్మె నోటీసు ఇచ్చారు. తమ డిమాండ్లపై స్పష్టత ఇవ్వాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. చర్చలు సఫలం 

Last Updated : Jun 11, 2020, 07:24 PM IST
కొనసాగుతున్న జూడాల సమ్మె...

హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ల ఆందోళన కొనసాగుతోంది.  గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు సమ్మె నోటీసు ఇచ్చారు. తమ డిమాండ్లపై స్పష్టత ఇవ్వాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. చర్చలు సఫలం అని ప్రభుత్వమే ప్రకటించుకుందని జూడాల ఆరోపించారు. మా ఆందోళనైతే కొనసాగుతోందని జూడాలు వెల్లడించారు

Also Read:  హార్ట్ ఎటాక్‌తో యువ దర్శకుడు మృతి )

గాంధీ ఆసుపత్రి వెలుపల ప్రధాన రహదారిపై ధర్నాకు దిగిన వైద్యులు సమ్మెను విరమించుకోవడానికి నిరాకరించారు. దాడి చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. అంతకు ముందు గాంధీ ఆసుపత్రి ఆడిటోరియంలో జూనియర్ డాక్టర్లతో గంటసేపు జరిగిన సమావేశంలో ఆరోగ్య శాఖామాత్యులు అన్నీ సమస్యలు, డిమాండ్లను విన్నారు. సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

Also Read: Gandhi hospital: గాంధీలో కరోనా పేషెంట్ డెడ్‌బాడీ మిస్సింగ్

గాంధీ ఆసుపత్రిలోని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ లోహిత్ రెడ్డి మాట్లాడుతూ (కరోనావైరస్మార్చి నుండి పూర్తి అంకితభావంతో పనిచేశామని, ప్రభుత్వ ఆదేశాలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని,  కోవిడ్ -19 రోగుల చికిత్సను వికేంద్రీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి తమతో ప్రత్యక్ష చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News