ఏపీలో తాజాగా 154 కరోనా కేసులు.. అదొక్కటే ఊరట

APFightsCorona | కరోనా  తీవ్రతను అధికంగా ఎదుర్కొంటున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ప్రతిరోజూ వందకు పైగా కేసులతో దేశంలో అధిక కరోనా కేసులు నమోదు చేస్తున్న రాష్ట్రాలలో ఏపీ ఉండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.

Last Updated : Jun 8, 2020, 05:07 PM IST
ఏపీలో తాజాగా 154 కరోనా కేసులు.. అదొక్కటే ఊరట

AP Corona Cases | ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు (AP COVID-19 Cases) నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో తాజాగా 154 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4813కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా మరణం సంభవించకపోవడమే కాస్త ఊరటనిచ్చే అంశం. దీంతో ఏపీలో కోవిడ్19 (COVID-19) మరణాల సంఖ్య 75గా ఉంది. సమగ్ర భూ సర్వేపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

గడిచిన 24 గంటల్లో ఏపీలో 14,246 శాంపిల్స్‌ పరీక్షించగా రాష్ట్రంలో ఉన్నవారిలో 125 కోవిడ్ పాజిటివ్ కేసులు, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో 29 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో చికిత్స అనంతరం 2,387 మంది డిశ్ఛార్జ్‌ కాగా, ప్రస్తుతం 1,381 మంది చికిత్స పొందుతున్నారు. అరటి పండు ఎక్కువగా తింటున్నారా.. ఇది తెలుసుకోండి

కాగా, విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకూ 132 మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా, ఇందులో కరోనా నుంచి ఆరుగురు కోలుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 838 మందికి కరోనా పాజిటివ్‌ తేలగా, ప్రస్తుతం 520 యాక్టీవ్‌ కేసులున్నాయి. తాజాగా 16 మంది డిశ్ఛార్జ్ అయ్యారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
నటి మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్

 

Trending News