అతి ముఖ్యమైన ప్రాజెక్ట్‌.. ఆలస్యం చేయొద్దు: వైఎస్ జగన్

ఏపీలో ప్రస్తుతం చేపడుతున్న సమగ్ర భూ సర్వే అత్యంత కీలకమైన ప్రాజెక్టు అని, ఏమాత్రం ఆలస్యం చేయకుండా పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు.

Last Updated : Jun 8, 2020, 04:47 PM IST
అతి ముఖ్యమైన ప్రాజెక్ట్‌.. ఆలస్యం చేయొద్దు: వైఎస్ జగన్

అమరావతి: సమగ్ర భూ సర్వే (Land Survey in AP) అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్ అని, దీనిపై ఆలస్యం చేయవద్దని అధికారులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) సూచించారు. ఆలస్యం చేయకుండా సమగ్ర భూసర్వేను మొదలుపెట్టాలని, అత్యంత ముఖ్యమైన ఈ ప్రాజెక్టును మూడు విడతల్లో సర్వే పూర్తి చేయాలన్నారు. మండలాల వారీగా బృందాలు ఏర్పాటు చేసుకుని సర్వే చేయాలని, సర్వే రాళ్ల ఖర్చుకూడా ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. అరటి పండు ఎక్కువగా తింటున్నారా.. ఇది తెలుసుకోండి

సమగ్ర భూ సర్వే (AP Lands Survey)పై క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ్ కల్లం, ల్యాండ్‌ అండ్‌ ఎండోమెంట్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉషారాణి తదితర అధికారులు పాల్గొన్నారు. గ్రామ సచివాలయాల పరిధిలో సర్వే చేస్తామన్న అధికారులు, సమగ్ర భూ సర్వే కోసం తీసుకుంటున్న చర్యలను సీఎంకు వివరించారు. సమగ్ర భూ సర్వేకోసం వినియోగిస్తున్న కార్స్‌ నెట్‌వర్క్‌ పనితీరును సీఎం జగన్‌కు వివరించారు. సులువుగా రోగ నిరోధకశక్తిని పెంచే చిట్కాలు

సర్వే వివరాలను డిజిటల్ రూపంలో భద్రపరుచనున్నారు. ఈ డిజిటల్‌ సమాచారాన్ని ఎన్‌క్రిప్ట్‌ చేయనున్నారు. ఈ సమగ్ర సర్వే సందర్భంగా తలెత్తే వివాదాలు పరిష్కరించడానికి మొబైల్‌ కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు. డిప్యూటీ కలెక్టర్ల పర్యవేక్షణలో మొబైల్‌ కోర్టులు నడుస్తాయని, తద్వారా రికార్డుల ప్రక్షాళన అవుతుందని అధికారులు పేర్కొన్నారు.  గ్లామర్ డాల్ సెక్సీ ఫొటోలు వైరల్ 

మూడు నాలుగు చోట్ల డేటా నిక్షిప్తం
డిజిటల్ డేటా చోరీ కావడమో లేక డేటా తారుమారు చేయడానికి వీలు కాకుండా మూడు నాలుగు చోట్ల డేటాను డిజిటల్ రూపంలో భద్రపరచనున్నారు. సమగ్ర సర్వే పూర్తయితే భూ విక్రయాలు, బదలాంపులు తేలిక అవుతాయని, రిజిస్ట్రేషన్ల ఆటో మ్యూటేషన్ జరుగుతుందని అధికారులు వెల్లడించారు. భూములపై యాజమాన్యపు హక్కులు కూడా ఈజీగా మార్పు చేసే వీలుంటుందని సీఎం వైఎస్ జగన్‌కు అధికారులు వివరించారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
నటి మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్

Trending News