హైదరాబాద్: Srisailam project శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో పవర్‌ను ఈ ఏడాది కూడా చెరో 50 శాతం వాడుకోవాల్సిందిగా కృష్ణా రివర్ బోర్డు ( KRMB ) ఇరు తెలుగు రాష్ట్రాలకు సూచించింది. అలాగే ఈ ఏడాది కూడా 66:34 నిష్పత్తిలో కృష్ణా నది నీళ్లను పంచుకునేందుకు ( Krishna water ) బోర్డు సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం కుదిరిందని కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు చైర్మన్ పరమేశం తెలిపారు. తమ రాష్ట్రాలకు చెందిన అన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వాల్సిందిగా తెలంగాణ, ఏపీలను కోరామని... ప్రభుత్వం అనుమతితో డీపీఆర్‌లు సమర్పిస్తామని రెండు రాష్ట్రాలు చెప్పాయని వెల్లడించారు. కృష్ణా నది నీటి పంపకాల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలు కొనసాగుతున్న తరుణంలో జరిగిన సమావేశం కావడంతో గురువారం నాటి సమావేశం కాస్త వాడివేడిగానే కొనసాగింది. ( Telangana: ఒక్క రోజే 127 కరోనా కేసులు.. ఆరుగురు మృతి )
టెలిమెట్రీల ఏర్పాటు కోసం కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ( KRMB)కి నిధులు ఇస్తామని రెండు రాష్ట్రాలు అంగీకరించాయని చెప్పిన ఆయన.. కృష్ణా రివర్ బోర్డు కార్యాలయాన్ని విజయవాడకు తరలించే అంశం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోకే వస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ తరపున ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఏపీ తరపున ఏపీ ఇరిగేషన్ స్పెషల్ ఛీప్ సెక్రెటరీ ఆదిత్యనాథ్ దాస్ వాదనలు వినిపించారు. ( Govt jobs alert: వైద్య ఆరోగ్య శాఖలో 9700 ఖాళీల భర్తీకి వారం రోజుల్లో నోటిఫికేషన్ )
శ్రీశైలం పవర్ ప్రాజెక్టు ( Srisailam power project ) నుంచి ఉత్పత్తి అయ్యే జల విద్యుత్తు వాడకంపైనా, బోర్డుకు రెండు రాష్ట్రాలు ఇవ్వాల్సిన నిధులపైనా ఈ సమావేశంలో చర్చించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు, బోర్డు సిబ్బంది పోస్టింగులు, బోర్డు వ్యయంపై ఆడిటింగ్ నివేదికలు వంటి అంశాలు ఈ భేటీలో చర్చకొచ్చాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
వాడివేడిగా Krishna river board సమావేశం.. తెలుగు రాష్ట్రాల మధ్య తేలిన లెక్కలు