సిద్దిపేట : తెలంగాణ రైతాంగానికి త్వరలోనే ఓ గుడ్ న్యూస్ ( Good news to farmers ) చెబుతానని సీఎం కేసీఆర్ ( Telangana CM KCR ) ప్రకటించారు. శుక్రవారం ఉదయం కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవం ( Kondapochamma Sagar inauguration ) అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రైతులు అద్భుతాలు సృష్టించే రోజులు ఇంకెంతో దూరంలో లేవని.. త్వరలోనే యావత్ దేశమే అబ్బురపడే వార్త ఒకటి చెప్పబోతున్నానని చెప్పి రైతన్నల్లో కొత్త జోష్ నింపే ప్రయత్నం చేశారు. కేసీఆర్ పట్టుబడితే మొండిపట్టు పడుతాడని మీ అందరికీ తెలిసిందేనని.. అలాగే ఈ గుడ్ న్యూస్ కూడా త్వరలోనే చెబుతానని అన్నారు. నీటిపారుదల రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని.. దాని ఫలితాలు కూడా అంతే అద్భుతంగా ఉంటాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ( Kaleshwaram project ) విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో ( Maharashtra govt ) ఒప్పందం కుదుర్చుకునే క్రమంలో తెలంగాణ అద్భుతమైన రాజనీతిని ప్రదర్శించిందని.. అందువల్లే ఇవాళ తెలంగాణ 530 టీఎంసీల నీళ్లను సద్వినియోగం చేసుకునే సామర్థ్యాన్ని సొంతం చేసుకుందని వెల్లడించారు. ( Photos: తెలంగాణలో మహత్తర ఘట్టం )
ఈ సందర్భంగా అన్నదాతలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రైతులు నియంత్రిత సాగు బాట పట్టాల్సిన అవసరం ఉందని.. నియంత్రిత సాగుకు మద్దతు తెలుపుతూ ఇప్పటికే వేలాది గ్రామాలు తీర్మానం చేశాయని తెలిపారు. ముఖ్యమంత్రి బాటే.. మా బాట అని రైతులు తీర్మానాలు చేసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. యావత్ దేశానికి తెలంగాణ ఆదర్శం కావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..