ఓ వైపు చైనా నుంచి పుట్టుకొచ్చిన కరోనా వైరస్ మహమ్మారి గబ్బిలాల నుంచి వచ్చిందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో 50కి పైగా గబ్బిలాలు చనిపోయి కనిపించడం హాట్ టాపిక్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎగసిన కెరటం నటి ఐశ్వర్య రాజేష్.. కంటతడి పెట్టించే విషాదాలెన్నో..
గోరఖ్‌పూర్ జిల్లాలోని బెల్ఘాట్ పట్టణంలో మంగళవారం ఉదయం 52 గబ్బిలాలు చనిపోయినట్లుగా గుర్తించారు. దీనిపై డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (DFO) అవినిష్ కుమార్ స్పందించారు. క్రిమి సంహారక మందులు వాడకం వల్లగానీ, లేక హార్ట్ స్ట్రోక్తోనైనా చనిపోయి ఉండొచ్చునని అభిప్రాయపడ్డారు. క్వారంటైన్ కేంద్రంలో విషాదం.. పాము కాటుతో బాలిక మృతి
చనిపోయిన గబ్బిలాల మృతదేహాలను పరీక్షల నిమిత్తం బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిస్టూట్‌కు తరలించారు. బెల్ఘాట్లోని రాధాస్వామి సత్సంగ్ భవనం సమీపంలోని తోటలో గబ్బిలాల మృతదేహాలు గుర్తించినట్లు తెలిపారు. బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి
మామిడి తోటలో కనిపించాయి కనుక పండ్లు తిని అవి చనిపోయి ఉండొచ్చుననే అనుమానులు రేకెత్తుతున్నాయి. అయితే గబ్బిలాల మరణానికి కరోనా వైరస్ ఏమైనా కారణమై ఉండొచ్చుననే కోణంలోనూ టెస్టులు చేయాలని రీసెర్చ్ ఇన్‌స్టిస్టూట్‌కు కోరినట్లు చెప్పారు. పోస్టుమార్టం నివేదిక వస్తే అన్ని విషయాలు తెలుస్తాయని డీఎఫ్‌వో పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..