హైదరాబాద్: తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తూర్పు విదర్భ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడగా.. మరోవైపు తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వాతావరణం మార్పు ప్రభావంతో బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ శివార్లలోని పలు ప్రాంతాలతో పాటు రంగారెడ్డి జిల్లా, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు కురిశాయి. పలు చోట్ల మూడు సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
Also read : బస్సుల కోసం వెయిటింగా ? ఇదిగో గుడ్ న్యూస్
ఇదిలావుంటే, వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేసినట్టుగానే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దీంతో ఏపీకి ఎంపాన్ తుపాన్ ముప్పు తప్పినట్టేనని తెలుస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..