'కరోనా వైరస్' ఎన్నెన్నో సిత్రాలు చేస్తోంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి వైరస్.. వింత వింత పనులకు కూడా కేంద్ర బిందువవుతోంది. భారత దేశంలో పెళ్లి సంస్కృతి చాలా గొప్పది. అలాంటిది కరోనా వైరస్ దెబ్బకు పెళ్లిళ్ల అర్థమే మారిపోతోంది.
కేరళలో కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఓ వింత పెళ్లి జరిగింది. నిజానికి పెళ్లంటే .. ఆకాశమంత పందిరి, భూదేవి అంత అరుగు వేసి చేస్తామని పెద్దలు చెబుతుంటారు. వధూవరుల తరఫు నుంచి బంధువులంతా ఒకచోటకు వస్తారు. అంగరంగ వైభవంగా, పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య జంటను ఒక్కటి చేస్తారు. హిందూ సంప్రదాయంలో అయితే అందరి సమక్షంలో వరుడు.. వధువు మెడలో తాళి కట్టి.. ఆ అమ్మాయిని తన సతీమణిని చేసుకుంటాడు.
కానీ కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు పెళ్లి అర్దం మారిపోయింది. లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో పెళ్లి కాదు కదా.. ! కనీసం ఇంటి నుంచి కాలు బయటపెట్టే పరిస్థితి లేదు. కాబట్టి చుట్టాలు, పక్కాల సందడి అసలే ఉండదు. అంతే కాదు కనీసం వివాహం చేసుకోవడానికి కూడా ప్రభుత్వం నుంచి అనుమతి లేదు. కాబట్టి కేరళలో ఓ వరుడు.. పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో అమ్మాయిని వీడియో కాల్లో పెళ్లి చేసుకున్నాడు. అంటే ఆన్ లైన్లో పెళ్లి అన్నమాట.
వరుడు.. వధువుకు తాళి కట్టాలి కదా.! ఇప్పుడతను ఫోన్‌కే తాళి కట్టేశాడు. అక్కడ అమ్మాయి తల్లి.. వధువుకు తాళి కట్టింది. ఇరు వైపులా వేద పండితులు వేద మంత్రాలు చదివి .. వధూవరులను ఆశీర్వదించారు. ఆ పెళ్లి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Lock Down Marriage 🤣😂🤪😜 pic.twitter.com/EDQUroBaYC
— Dr. Ananthanarayanan ; MD DM (@DrAnanthanaray1) April 28, 2020