హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాపించడం (Coronavirus spread in Telangana) తగ్గిందా అంటే గత మూడు రోజులుగా నమోదవుతున్న సింగిల్ డిజిట్ కేసులను చూస్తోంటే అవుననే అనిపిస్తోంది. అవును, ఆదివారం, సోమవారం తరహాలోనే మంగళవారం కూడా తెలంగాణలో కొత్తగా గుర్తించిన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 6 కి పరిమితం అవడం కొంత ఊరట కలిగిస్తోంది. అంతేకాకుండా డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య సైతం పెరుగుతుండటం ఇంకొంత ఉపశమనాన్నిస్తోంది. తాజాగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ ఇవాళ రాష్ట్రంలో 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. అవి కూడా జిహెచ్ఎంసీ పరిధిలోనివేనని తెలిపారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1009 చేరుకుంది.
Also read : తెలంగాణలో కోవిడ్ పరీక్షలపై ఆరోపణలు.. స్పందించిన మంత్రి ఈటల
ఇవాళ కరోనా నుంచి కోలుకుని 42 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటివరకు అలా మొత్తం 374 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 610 యాక్టీవ్ కేసులు ఉండగా... కరోనాతో ఇప్పటివరకు 25 మంది మృతి చెందారని మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..