కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ముప్పు తిప్పలు పెడుతోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య సైతం పెరిగిపోతోంది. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందునక ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 30 లక్షలు దాటిపోయింది. మరోవైపు కరోనా మరణాలు 2.10 లక్షలు దాటినట్లు కరోనా సమాచారం అందించే జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. Photos: పెళ్లి తర్వాత నటి గ్లామర్ షో!
2019 డిసెంబర్ నెలలో చైనాలో మొట్టమొదటి కరోనా కేసు పుట్టుకొచ్చింది. నేడు ఆ కేసుల సంఖ్య 30,37,605కు చేరుకోవడం పలు దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. 2,10,842 మంది కరోనా కాటుకు బలయ్యారు. దాదాపుగా 1 మిలియన్ పాజిటివ్ కేసులతో వైరస్ తీవ్రతను అధికంగా చవిచూస్తున్న దేశం అమెరికా. స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారీగా పెరిగిన బంగారం ధరలు.. వెండి పతనం
అమెరికాలో అత్యధికంగా 9,87,467 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 56,164 మరణాలతో అగ్రరాజ్యం అమెరికా కరోనా దేశంగా మారింది. స్పెయిన్‌లో 2,29,422, ఇటలీలో దాదాపు 2 లక్షల కేసులు, ఫ్రాన్స్ 1,65,962 కేసులు, జర్మనీ 1,58,434 పాజిటివ్ కేసులతో కరోనా తీవ్రతను ఎదుర్కొంటున్న తొలి 5 దేశాలుగా ఉన్నాయి. 1,58,348 కరోనా కేసులతో బ్రిటన్ ఆరో స్థానంలో నిలిచింది. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
టర్కీలో 1,12,261, ఇరాన్‌లో 91,472, రష్యాలో 87,147, చైనాలో 83,918, బ్రెజిల్‌లో 66,501, కెనడాలో 49,606 పాజిటివ్ కేసులతో కరోనా మహమ్మారితో పోరాడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 5 దేశాల్లో 20 వేలకు పైగా కరోనా మరణాలు సంభవించాయంటే కరోనా తీవ్రత ఎంతలా ఉందో అర్థమవుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..