ఢిల్లీ, హరియాణా మధ్య కొత్త పంచాయితీ..!!

'కరోనా వైరస్'.. వేగంగా విస్తరిస్తోంది. అంతే కాదు ఎన్నెన్నో సిత్రాలు చేస్తోంది. ఇప్పటికే ఊళ్లు, పట్టణాల మధ్య చిచ్చు పెట్టిందీ మహమ్మారి. ఇప్పుడు ఏకంగా రాష్ట్రాల మధ్య కొత్త పంచాయితీలు సృష్టిస్తోంది. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న కారణంగా.. పొరుగున ఉన్న రాష్ట్రాల్లో కొత్త రగడ మొదలవుతోంది.

Last Updated : Apr 27, 2020, 03:20 PM IST
ఢిల్లీ, హరియాణా మధ్య కొత్త పంచాయితీ..!!

'కరోనా వైరస్'.. వేగంగా విస్తరిస్తోంది. అంతే కాదు ఎన్నెన్నో సిత్రాలు చేస్తోంది. ఇప్పటికే ఊళ్లు, పట్టణాల మధ్య చిచ్చు పెట్టిందీ మహమ్మారి. ఇప్పుడు ఏకంగా రాష్ట్రాల మధ్య కొత్త పంచాయితీలు సృష్టిస్తోంది. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న కారణంగా.. పొరుగున ఉన్న రాష్ట్రాల్లో కొత్త రగడ మొదలవుతోంది.

దేశ రాజధాని ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్  రాష్ట్రాలు దాదాపు  కలిసే ఉంటాయి. ఢిల్లీ నుంచి ఈ రెండు రాష్ట్రాలకు రాకపోకలు సాగడం చాలా సర్వసాధారణం. ఇంకా చెప్పాలంటే ఉద్యోగులు, వ్యాపారులు, సామాన్యులు.. ఈ మూడు రాష్ట్రాల  పరిధిలో నిత్యం తిరుగుతూనే ఉంటారు. కరోనా వైరస్ కారణంగా.. ఇప్పుడు ఈ మూడు రాష్ట్రాల మధ్య కొత్త చిచ్చు రేగింది. కరోనా వైరస్  మీ రాష్ట్రం నుంచే మా రాష్ట్రానికి వస్తోందని .. ఒక రాష్ట్రంపై ఒక రాష్ట్రం నిందలు వేసుకుంటున్నాయి. 

కరోనా మహమ్మారిని ఢిల్లీ నుంచి హరియాణాకు పంపిస్తున్నారని హరియాణా వైద్య శాఖ మంత్రి అనిల్ విజ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీంతో హరియాణా, ఢిల్లీ మధ్య రాజకీయ రగడ ప్రారంభమైంది. ఢిల్లీలో పని చేస్తున్న ఉద్యోగులు.. రోజూ ఆఫీసులకు వెళ్లి తిరిగి హరియాణాలో ఉన్న ఇళ్లకు వస్తున్నారని.. అంతే కాకుండా కరోనా మహమ్మారిని వెంట తీసుకువచ్చి.. అందరికీ అంటుపెడుతున్నారని అనిల్ విజ్ విమర్శించారు. దీనిపై ఢిల్లీ ప్రభుత్వం కూడా స్పందించింది. 

ఢిల్లీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర  జైన్ ... హరియాణా వైద్య శాఖ మంత్రి అనిల్ విజ్ విమర్శలపై గట్టి కౌంటర్ ఇచ్చారు. అనిల్ విజ్ తన వ్యాఖ్యలను ఉపసహరించుకోవాలని డిమాండ్ చేశారు. అంతే కాదు ఢిల్లీలో ఉంటున్న చాలా మంది కూడా సరిహద్దు రాష్ట్రాల్లోని ప్రాంతాల్లో పని చేస్తున్నారని.. వారంతా పనులు పూర్తి చేసుకుని ఢిల్లీకి తిరిగి వస్తున్నారని చెప్పారు. ఉద్యోగులు అన్నప్పుడు రెండు రకాలుగా రాకపోకలు ఉంటాయని తెలిపారు. కాబట్టి అనిల్ విజ్ వ్యాఖ్యలు సరికాదన్నారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

 

Trending News