ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మరింతగా పెరిగిపోతున్నాయి. కొత్త ర్యాపిడ్ కిట్లు తెప్పించి టెస్టులు పెంచిన కొద్దీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 81 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1097కు చేరుకుంది. ఎంపీ కుటుంబంలో కరోనా కలకలం
గడిచిన 24 గంటల్లో 60 మంది కోవిడ్ బారి నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. కర్నూలు జిల్లాలో 24 మంది, నెల్లూరులో 15, ప్రకాశంలో 11, గుంటూరులో 6, చిత్తూరులో ఇద్దరు, పశ్చిమ గోదావరి, అనంతపూర్ జిల్లాల నుంచి ఒక్కరు చొప్పున డిశ్ఛార్చ్ అయ్యారు. కాగా, గత 24 గంటల్లో ఏపీలో ఎటువంటి కరోనా మరణాలు సంభవించలేదు. మీ కళ్లు అలా మారితే బీ కేర్‌ఫుల్!
చికిత్స అనంతరం కోవిడ్ బారి నుంచి కోలుకుని రాష్ట్రంలో ఇప్పటివరకూ 231 మంది డిశ్చార్జ్ కాగా, 31 మంది మరణించారు. ప్రస్తుతం 835 చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఈ వివరాలు వెల్లడించింది. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
ఏపీలో తాజాగా 81 కరోనా కేసులు