బస్కీలు తీయాల్సిందే..!!

'కరోనా వైరస్'ను ఎదుర్కోవడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. ఇంట్లో ఉండడి.. సామాజిక దూరం  పాటించండి.. అని రాజకీయ, సినీ ప్రముఖులు ప్రచారం  చేశారు. అత్యవసర పనులు ఉంటే తప్ప, నిత్యావసర సరుకుల కోసం తప్ప.. బయటకు రావొద్దని చెప్పారు.

Last Updated : Apr 13, 2020, 01:45 PM IST
బస్కీలు తీయాల్సిందే..!!

'కరోనా వైరస్'ను ఎదుర్కోవడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. ఇంట్లో ఉండడి.. సామాజిక దూరం  పాటించండి.. అని రాజకీయ, సినీ ప్రముఖులు ప్రచారం  చేశారు. అత్యవసర పనులు ఉంటే తప్ప, నిత్యావసర సరుకుల కోసం తప్ప.. బయటకు రావొద్దని చెప్పారు.లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేస్తే .. కరోనా మహమ్మారిని తరిమికొట్టే అవకాశం ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ చాలా ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. ఇందుకోసం అన్ని రాష్ట్రాల్లో పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారు. కానీ కొంత మంది వల్ల పోలీసులకు తలనొప్పి తయారైంది. వద్దన్నా ఇంట్లో నుంచి బయటకు వచ్చి లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. 

పోలీసులు తొలుత పూలు ఇచ్చి ఇంటికి వెళ్లిపోవాలని సూచించారు. అలాగే తమిళనాడు రాజధాని చెన్నైలో కరోనా వైరస్ హెల్మెట్ ధరించి వారిని ఇళ్లకు వెళ్లిపోవాలని చెప్పారు. ఐనప్పటికీ జనం మాట వినే పరిస్థితి కనిపించడం లేదు. నిత్యం ఏదో ఒక దగ్గర  జనం బయట తిరుగుతూనే ఉన్నారు.

లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘిస్తే అదే శిక్ష 

కాబట్టి పోలీసులు లాఠీలకు పని చెబుతున్నారు. రోడ్లపై తిరిగే యువతను లాఠీలతో చెదరగొట్టి ఇళ్లకు పంపిన పరిస్థితులు చూశాం. ఇప్పుడు సరికొత్త ఐడియాతో తెలంగాణ పోలీసులు ముందుకొచ్చారు. రోడ్లపై తిరిగే వారికి అక్కడికక్కడే శిక్ష అమలు చేస్తున్నారు. లాక్ డౌన్ రూల్స్ అధిగమించిన వారితో బస్కీలు తీయిస్తున్నారు. రోడ్లపై మళ్లీ తిరగబోమని వారి నోటితోనే చెప్పిస్తున్నారు.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News