'కరోనా వైరస్'పై సామూహిక యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. బీజేపీ 40వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బీజేపీ కార్యకర్తలకు ఆయన సందేశం ఇచ్చారు. కరోనా వైరస్ పై ప్రపంచ దేశాలన్నీ మూకుమ్మడిగా యుద్ధం చేయాలన్నారు. అలా జరిగితేనే వైరస్ లొంగి వస్తుందని స్పష్టం చేశారు.
భారత దేశం కరోనా వైరస్ పై త్వరితగతంగా చర్యలు తీసుకుందని ప్రధాని మోదీ తెలిపారు. లాక్ డౌన్ విధించడంతో సమస్య పెరిగి పెద్దది కాలేదన్నారు. అలాగే లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేయడంలో ప్రజల సహకారం మరువలేనిదన్నారు. భారత దేశంలో ఇంత చక్కగా ప్రజలు ముందుకొస్తారని .. ప్రపంచ దేశాలు ఊహించలేదన్నారు. ఇంకా చెప్పాలంటే భారత దేశం చేసిన కృషి ప్రపంచ దేశాలకు ఓ ఉదాహరణగా మారిందని చెప్పుకొచ్చారు. కరోనా మహమ్మారిని త్వరగా అర్ధం చేసుకుని ఇండియా యుద్ధం ప్రకటించిందని తెలిపారు. కరోనా మహమ్మారిపై దాడి చేసేందుకు తీసుకున్న నిర్ణయాలన్నీ త్వరగా తీసుకుని .. అతి త్వరగా పకడ్బందీగా అమలు చేశామని చెప్పుకొచ్చారు.
#WATCH: PM Modi's message on BJP's 40th foundation day today https://t.co/jm24WBQpLB
— ANI (@ANI) April 6, 2020
భారత దేశం తీసుకున్న నిర్ణయాలను ప్రపంచ దేశాలతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రశంసించిన విషయాన్ని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఇండియా తరహాలోనే అన్ని ప్రపంచ దేశాలు కరోనా వైరస్ పై యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..