Indiramma Indlu Beneficiary Status: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు తుది దశ మెరుగు దిద్దుకుంటుంది. ఈ పథకంలో భాగంగా నేరుగా మీ స్టేటస్ చెక్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించింది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే యాప్ కూడా ప్రారంభించింది సర్కార్. నేరుగా ఇందులో లబ్ధిదారులు తమ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
Indirammaindlu.telangana.gov.in ప్రభుత్వ అధికార వెబ్సైట్లో సింపుల్గా వివరాలను చెక్ చేసుకోవచ్చు. ఇందులో బెనిఫిషియరీ స్టేటస్ అందుబాటులో ఉంది. ఇందిరమ్మ ఇళ్లలో ఖాళీ జాగా ఉన్నవారికి రూ.5 లక్షల నిధులు మంజూరు చేయడంతో పాటు ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్లను మంజూరు చేయనున్నారు.
ఇప్పటికే 80 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. ఇంతమంది అప్లై చేయడంతో వడబోతాకి సమయం పట్టింది. మొదట అభయహస్తంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణలో కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.ఇది కాకుండా కొంతమంది తాము అర్హులమని తమకు పథకం అమలు కాలేదని వాపోయారు.
అయితే ఇది నిరంతర ప్రక్రియ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. అత్యధిక విధానంతో అసలైన లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సర్వే చేయించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇక యాప్ లో ఇందిరమ్మ ఇల్ల మంజూరుకు సంబంధించిన వివరాలు యాప్ లో కూడా లబ్ధిదారుల వివరాలను నమోదు చేశారు.
టోల్ ఫ్రీ నెంబర్ కూడా అందుబాటులో ఉంచారు. అందులో మీకు ఏమైనా సందేహాలు ఉంటే వెబ్సైట్లో కంప్లైంట్ చేయవచ్చు. దరఖాస్తుదారుడు వివరాలు తెలుసుకునేందుకు అక్కడ ఫోన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఐఎఫ్ఎస్సి నెంబర్ ద్వారా అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అయితే, రేషన్ కార్డుల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు.
తెలంగాణలో చాలా రోజులుగా రేషన్ కార్డులు మంజూరు చేయలేదు. ఇక ఎక్కువ శాతం పథకాలు రేషన్ కార్డుతో ముడి పెట్టారు.దీంతో చాలామంది రేషన్ కార్డులు కొత్తవి ఎప్పుడు జారీ చేస్తారా? అని ఎదురు చూస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కూడా కొనసాగుతుంది.