Telangana Weather Update: రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతుంది. పగటి ఉష్ణోగ్రతలు కాస్త ఎండ తీవ్రత పెరిగింది. రాత్రి పూట చలి తీవ్రంగా వణికిస్తుంది. మధ్యాహ్నం ఎండ దంచుతుంది. హైదరాబాద్ పరిధిలో గరిష్టంగా 30 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
తెలంగాణలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. ఉదయం కాస్త చలి, మధ్యాహ్నం ఎండ, ఇక రాత్రి సమయంలో సాయంత్రం 6 అయితే, చాలు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి తీవ్రత పెరిగిపోతుంది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. కానీ, ఎండ మధ్యాహ్నం మాత్రం 30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ఎండలు మళ్లీ దంచికొట్టడం స్టార్ట్ అయింది.
ఈ భిన్న వాతావరణంతో ప్రజలకు ఇబ్బందులు మొదలయ్యాయి. సంగారెడ్డిలో రాత్రి ఉష్ణోగ్రతలు 7 డిగ్రీలు నమోదు అయ్యాయి. కుమురం భీమ్ ఆసిఫాబాద్ 7 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లాలో 8 డిగ్రీలు, వికారాబాద్ 9 డిగ్రీలు, కామారెడ్డి 10, రాజన్న సిరిసిల్ల 10 డిగ్రీలు, మహబూబ్ నగర్ 10 డిగ్రీలు నమోదు అయ్యాయి.
ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజేంద్ర నగర్లో 9 డిగ్రీలు, పటాన్చేరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అయితే, గ్రేటర్ పరిధిలో కూడా పగటి పూట ఎండ మాత్రం బాగానే ఉంటుంది.
హైదరాబాద్లో ఉదయం పొగ మంచు కమ్మతోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక కనిష్టంగా 16 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతే గరిష్టంగా 32 డిగ్రీలు నమోదు అవుతున్నట్లు చెప్పింది. ఈ నేపథ్యంలో ఇలాంటి భిన్న వాతావరణంలో కూడా సీజనల్ జబ్బుల వస్తాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.