Leopard Attack: చిరుతపులి దాడి చేయడంలో షారుక్ ఖాన్ ఒక్కసారిగా భయంతో వణికిపోయాడు. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమై గట్టిగా అరుపులు వేయడంతో చిరుత పారిపోయింది. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
ఇటీవల చిరుత పులులు అడవుల్లో నుంచి ఎక్కువగా బైటకు వస్తున్నాయి. అడవికి దగ్గరగా ఉన్న ప్రదేశాలలో చిరుతపులులు ఎక్కువగా బైటకు వస్తున్నాయి. ముఖ్యంగా వేట కోసం, తాగు నీటి కోసం చిరుతలు గ్రామాల మీద పడుతున్నాయి.
చిరుతలు రాత్రి పూట గ్రామాలపైకి దాడులు చేస్తున్నాయి. అంతేకాకుండా.. కుక్కలు, ఆవులు, మేకల మీద ఎక్కవగా దాడులు చేస్తున్నాయి. ఇటీవల చిరుతలతో జనాలు భయంతో వణికిపోతున్నారు.
తాజాగా.. మహారాష్ట్రలోని వసాయి గ్రామంలో మంగళవారం రాత్రి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రాత్రి పూట అడవిలో నుంచి చిరుత పులి రోడ్డు మీదకు వచ్చింది. అప్పుడు బైక్ మీద వెళ్తున్న ఒక వ్యక్తి మీదకు దాడికి ప్రయత్నించింది.
వెంటనే అతను తెరుకుని గట్టిగా కేకలు వేయడంతో ఆ చిరుత తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది. అతని అరుపులు విని అక్కడి గ్రామస్థులు కర్రలు, రాళ్లు పట్టుకుని అక్కడకు చేరుకున్నారు.
గ్రామస్థులు వెంటనే ఫారెస్ట్ సిబ్బందికి, పోలీసులుకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ప్రత్యేకంగా బోనులను ఏర్పాటు చేశారు. అయితే.. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. చిరుత పులి దాడికి యత్నించిన వ్యక్తి పేరు షారుక్ ఖాన్. ఈ క్రమంలో షారుక్ ఖాన్ అనగానే.. బాలీవుడ్ నటుడు అని చాలా మంది పప్పులో కాలేశారు.
ఈ క్రమంలో చిరుత దాడి బాలీవుడ్ నటుడి మీద జరిగిందని కొంత మంది అర్థం చేసుకున్నారు. దీంతో ఈ మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన కాస్త వార్తలలో నిలిచింది. సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది.