Veg Protein Foods: శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్ ఫుడ్ తప్పనిసరి. కండరాలను పటిష్టం చేయడం, కణజాలం మరమ్మత్తు, శరీర నిర్మాణానికి చాలా అవసరం. ప్రోటీన్ అంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ చికెన్ లేదా గుడ్లు లేదా చేపలు గుర్తొస్తాయి ఎవరికైనా. అయితే కొన్ని శాకాహార పదార్ధాలతో కూడా చికెన్ కంటే అధికంగా ప్రోటీన్లు అందుతాయి. అలాంటి 5 వెజిటేరియన్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం.
నట్స్ సీడ్స్ బాదం, వాల్ నట్స్, పిస్తా, సన్‌ఫ్లవర్ సీడ్స్, ఆనపకాయ విత్తనాల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి కావల్సిన ఎనర్జీ లభిస్తుంది.
క్వినోవా క్వినోవా అనేది సూపర్ గ్రెయిన్. ఇది బెస్ట్ వెజిటేరియన్ ప్రోటీన్ ఫుడ్. ఇందులో అవసరమైన 9 ఎమైనో యాసిడ్స్ ఉంటాయి. కండరాల ఎదుగుదలకు ఉపయోగపడతాయి.
చియా సీడ్స్-ఫ్లక్స్ సీడ్స్ చియా సీడ్స్, ఫ్లక్స్ సీడ్స్‌లో ప్రోటీన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. బరువు తగ్గించేందుకు దోహదమౌతాయి
సోయా బీన్-టేపూ సోయాబీన్స్‌ను ప్రోటీన్లకు పవర్ హౌస్ అంటారు. 100 గ్రాముల సోయాబీన్స్‌లో దాదాపు 36 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. టేపూ కూడా సోయాబీన్‌తో తయారవుతుంది. ఇందులో ప్రోటీన్లతో పాటు కాల్షియం పెద్దఎత్తున ఉంటుంది
పప్పులు, బీన్స్ పప్పులు, బీన్స్‌లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. పెసర పప్పు, మసూర్ దాల్, రాజ్మా, శెనగల్లో కావల్సినంతగా ప్రోటీన్లు ఉంటాయి. 100 గ్రాముల రాజ్మా తీసుకుంటే దాదాపు 24 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి.