న్యూఢిల్లీ: విశ్వవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న కరోనావైరస్ ను పూర్తి స్థాయిలో అంతమొందించడానికి ఇప్పటికే పలు దేశాలు లక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేవలం ఈ లాక్డౌన్ అంశం సరిపోదని వైరస్ సంక్రమణను రూపుమాపాలంటే ఖచ్చితమైన అత్యవసర ప్రజారోగ్య చర్యలు అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుడు మైక్ ర్యాన్ పేర్కొన్నారు. ప్రస్తుతం అత్యవసరంగా దృష్టి పెట్టవల్సిన అంశమేమిటంటే.. అనారోగ్యంతో ఉన్నవారిని, వైరస్ సోకిన వారిని కనిపెట్టాలని, వెంటనే వారిని ఐసొలేషన్ కు తరలించాలని మైక్ ర్యాన్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
Read Also: యథేచ్ఛగా యువత షికారు.. పోలీసులు ఏం చేశారో తెలుసా....
లాక్డౌన్లతో కేవలం వైరస్ సోకకుండా నివారించవచ్చని, ఈ ప్రక్రియ ఎత్తివేసిన తరవాత తిరిగి యాధావిది పరిస్థితి నెలకొంటుందని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశాలు పటిష్టమైన ప్రజారోగ్య చర్యలను వేగవంతం చేయాలని, పూర్తి అప్రమత్తత, పౌరుల స్వీయ నియంత్రణ అవసరమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని మహమ్మారిగా ప్రకటించింది.
Also Read: 'కరోనా'పై గాయని కరుణ హృదయం
కరోనా సంక్రమణ ఇటలీలో భయంకరంగా వ్యాపిస్తోంది. రోజూకు వందల సంఖ్యల్లో మృతిచెందుతుడటంతో పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుపోయిది. మరోవైపు UK ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ స్పందిస్తూ.. వైరస్ బారిన పడకుండా తమను తాము ప్రజలు సామాజిక దూరాన్ని పాటించవల్సిన అవసరముందనిని, వచ్చే వారం పరీక్షల ఉత్పత్తి రెట్టింపు అవుతుందని, ఆ తర్వాత బాధితుల తీవ్రత పెరుగుతుందని బ్రిటిష్ మంత్రి రాబర్ట్ జెన్రిక్ పేర్కొన్నారు. ఇప్పటికే కరోనా వైరస్ మహమ్మారిని జయించటానికి పలు దేశాలు టీకాలపై పరిశోధనలు అభివృద్ధి దశలో ఉన్నాయని మైక్ ర్యాన్ తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..