Navdeep Singh: అవహేళన చేశారు. ఆత్మహత్య చేసుకోమన్నారు.. సీన్ కట్ చేస్తే ప్రపంచాన్ని ఏలుతున్నాడు.. ఈ దివ్యాంగుడి కథ వింటే కన్నీళ్లు ఆగవు

Navdeep Singh: నవదీప్‌సింగ్‌ను జీ న్యూస్ 'రియల్ హీరోస్ అవార్డ్‌'తో గౌరవించింది. పారిస్‌ ఒలింపిక్స్‌లో జావెలెన్‌ థ్రోలో గోల్డ్‌మెడల్‌ సాధించిన నవదీప్‌ సింగ్‌ లైఫ్‌ స్టోరీ ఎంతో స్ఫూర్తిదాయకం.
 

1 /8

Navdeep Singh: టాలెంట్‌ ఎవడబ్బ సొత్తు కాదు.. ఎవడి ఇంటి పేరు అంతకన్నా కాదు.. కాళ్లు లేకున్నా, చేతులు లేకున్నా, శరీరంలోని అవయవాలు పని చేయకున్నా బతుకీడ్చి పోరాటాలు చేస్తూ విశ్వాన్ని జయించే వారు మనకళ్ల ముందు కూడా కనిపిస్తారు. నవదిప్‌ సింగ్‌ సరిగ్గా అలాంటి మనిషే. రెండేళ్ల వయసలోనే మరుగుజ్జుతనం అతడి జీవితాన్ని ఆవహించింది.   

2 /8

కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు, అవహేళనలు ఇలా ప్రతీ అంశం అతడి జీవితాన్ని చిన్నాభిన్నం చేయాలని చూశాయి. కానీ అవేవీ కూడా అతని పట్టుదల ముందు, పోరాట పటిమ ముందు నిలపడలేకపోయాయి. 2024 పారిస్‌లో జరిగిన పారాలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణం తీసుకొచ్చిన నవదీప్‌కు జీ న్యూస్ 'రియల్ హీరోస్ అవార్డ్‌'తో గౌరవించింది. నిజానికి నవదీప్ రెజ్లింగ్‌లో కూడా అదరగొడతాడు. రెజ్లింగ్‌లో రాష్ట్ర స్థాయి ఛాంపియన్ కూడా. అయితే ఆ తర్వాత జావెలిన్‌లోనూ అద్భుతాలు చేశాడు. అలా ఇండియాకు గోల్డ్‌మెడల్‌ తెచ్చాడు.  

3 /8

క్రీడాకారుల అడ్డా హర్యానాలోని పానిపట్‌లో 2000 సంవత్సరంలో పుట్టాడు నవదీప్. అతనికి రెండేళ్ల వయసున్నప్పుడే మరుగుజ్జు ఉందని తల్లిదండ్రులకు తెలిసింది. ఎదుగుతున్న సమయంలో ఇలా జరగడం వారి తల్లిదండ్రులను ఎంతో మానసిక క్షోభకు గురి చేసింది. నవదీప్‌కు ఢిల్లీలో చికిత్స ఇవ్వడం ప్రారంభించారు.   

4 /8

మరోవైపు నవదీప్‌ తనకున్న సమస్య గురించి ఆలోచించకుండా గ్రామంలో జరిగే అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనేవాడు. ఆ తర్వాత అక్కడ నుంచి నవదీప్‌ ప్రయాణం జాతీయ స్థాయిలో పతకాలు సాధించే వరకు వెళ్లింది. నవదీప్‌ ప్రతిభను హర్యానా ప్రభుత్వం ముందుగానే గుర్తించింది. 2012లో రాష్ట్రీయ బాల పురస్కారం అవార్డుతో నవదీప్‌ను మరింత ప్రోత్సహించింది.   

5 /8

ఇంత సాధిస్తున్నా సమాజం నుంచి మాత్రం నవదీప్‌కు అవమానాలు ఆగలేదు. మరుగుజ్జు కావడంతో అంతా ఆటపట్టించేవారు. అందుకే నవదీప్‌ ఇంటి నుంచి బయటకు రావడానికి కూడా కొన్నిసార్లు భయపడేవాడట. అయితే నవదీప్‌లో మార్పు తీసుకొచ్చేందుకు అతని తండ్రి పుస్తకాలు కొని తెచ్చాడు. ఈ పుస్తకాలతో నవదీప్‌ మైండ్‌సెట్ మారుతూ వచ్చింది.

6 /8

అటు వాస్తవానికి నవదీప్ మొదట రెజ్లర్ కావాలని అనుకున్నాడు. అయితే చిన్నప్పుడు గేమ్‌ ఆడుతుంటే అతని వెన్నుకు గాయమైంది. దీంతో రెజ్లింగ్‌ను పక్కన పెట్టాడు. ఆ సమయంలో నవదీప్‌ చూసిన ఓ వీడియో అతడి జీవితాన్ని మార్చేసింది. 'పానిపట్ బాలుడు అద్భుతాలు చేశాడు, ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు' అనే స్టోరీ లైన్‌లో ఉన్న ఓ వీడియో బళ్లెం వీరుడు నీరజ్‌ చోప్రా గురించి. ఆ వీడియో చూసిన తర్వాత జావెలన్‌ థ్రోలో తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లాలని బలంగా ఫిక్స్‌ అయ్యాడు నవదీప్‌.   

7 /8

అప్పటి నుంచి అద్భుతాలు చేస్తూ వచ్చాడు. ఎన్నో రికార్డులు సృష్టించాడు. అయితే పారా ఆసియా గేమ్స్, టోక్యో పారాలింపిక్స్, పారా వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో నాలుగో స్థానంలో నిలిచిన సమయంలో నవదీప్‌ను కొంతమంది హేళన చేశారట. నువ్వు నాలుగో స్థానం తెచ్చుకున్నావంటే నీకు గేమ్‌ రాదని అవమానించారట.. కొందరైతే సచ్చిపో అని కూడా వెటకారంగా మాట్లాడారట. అయినా నవదీప్‌ ఎక్కడా కుంగిపోలేదు.   

8 /8

టోక్యోలో చేజారిన పతకాన్ని పారిస్‌లో ఒడిసి పట్టుకున్నాడు. అయితే ఈ పతకం గెలవడానికి రెండు నెలల ముందు అతని తండ్రి చనిపోవడం నవదీప్‌ను చాలా బాధపెట్టింది. ఇక నవదీప్ రాష్ట్రపతి అవార్డుకు ఎంపికైనప్పుడు అతని గ్రామం మొత్తం సంబురాలు చేసుకుంది. ఇలా రియల్‌ లైఫ్‌లో అసలుసిసలైన హీరో అనిపించుకున్నా నవదీప్‌కు 'జీ' స్పెషల్‌ కంగ్రెట్స్ చెబుతోంది.