Sobhita Sankranti Celebrations: సంక్రాంతి సందర్భంగా శోభిత ధూళిపాల నాగచైతన్యతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ముఖ్యంగా ఓ ఫోటో పై మాత్రం నెట్టింట వైరల్ అవుతుంది ..ఎందుకంటే శోభిత ధూళిపాల అడ్డంగా దొరికిపోయింది. ఆమె దిగిన ఫోటోల్లో అవి లేకుండా కనిపించింది. దీంతో నెట్టిజెన్లు ఏంటి మొదటి పండుగకు ఇలా చేసింది శోభిత అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.
శోభిత నాగచైతన్య డిసెంబర్ 4వ తేదీన సంప్రదాయబద్దంగా పెళ్లి చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహం అయితే పెళ్లయిన తర్వాత శోభిత నాగచైతన్య మొదటి సంక్రాంతి పండుగ. ఈ సందర్భంగా గ్రాండ్‌గా సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకున్న శోభిత ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు
భోగి మంటలు వేసిన ఫోటోలను శోభిత షేర్ చేశారు. భోగి సందర్భంగా 'హ్యాపీ భోగి రెన్యువల్ ట్రాన్స్ఫర్మేషన్' అని పోస్ట్ చేశారు.ఆ తర్వాత హ్యాపీ సంక్రాంతి హ్యాపీ పొంగల్ అని ఒక అందమైన చుక్కల ముగ్గు ఫోటోను షేర్ చేశారు. చూడటానికి ఈ రెండు ఫోటోలు సంప్రదాయం ఉట్టిపడేలా కనిపించాయి.
ఈ ఫోటోల్లో శోభిత మెరూన్ కలర్ , గోల్డ్ కలర్ బార్డర్ లో ఉన్న చీరను ధరించారు. దానిపై ఆమె క్రీమ్ కలర్ బ్లౌజ్ వేసుకొని, హెయిర్ స్టైల్ బన్ వేసుకున్నారు. మొత్తానికి ట్రెడిషనల్ లుక్ లో శోభితా ధూళిపాల కనిపించింది. అయితే సంక్రాంతి సందర్భంగా హీరో నాగచైతన్యతో ఆమె దిగిన ఫోటోను సైతం శోభిత పోస్ట్ చేసింది.
ఈ పోస్టులో నాగచైతన్యతోపాటు తన కాళ్లను కూడా ఓ చిన్న ముగ్గు వద్ద దిగిన ఫోటోను లవ్ సింబల్ తో షేర్ చేసింది. అందులో శోభిత కాళ్లకు మెట్టెలు లేకుండా ఉన్నాయి. మొదటి పండుగ సందర్భంగా కాళ్లకు మెట్టెలు లేకుండా ఉన్నాయంటే అని సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
ఇక ఇదే సోషల్ మీడియా పోస్ట్‌లో పొంగల్ చేసిన ఫోటో కూడా షేర్ చేశారు. అయితే నాగచైతన్య సమంతలు విడాకులు తీసుకున్న తర్వాత శోభిత దూళిపాలను పెళ్లి చేసుకున్నాడు. వీరిది కూడా ప్రేమ వివాహం ప్రస్తుతం సమంత సినిమాలో బిజీగా ఉన్నారు.. నాగచైతన్య తండేల్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.