Cold Wave in Telangana : సంక్రాంతికి చంపేంత చలి ఉంటుందనేది పెద్దలు చెప్పే విషయం. తాజాగా ఈ సంక్రాంతి పండగ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా చలి గాలులు తీవ్రంగా వీస్తున్నాయి. దీంతో మరో రెండు రోజులు పాటు తెలంగాణకు చలి పులి పంజా విసరనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Cold Wave: తెలంగా రాష్ట్రంలో రాగల రెండు వరకు చలి తీవ్రత అధికంగా ఉండనుంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిజామాబాద్, హైదరాబాద్ లో చలి తీవ్రంగా ఉండనున్నట్టు వాతావరణ శాఖ విశ్లేషించింది.
తెలంగాణ రాష్ట్రంలో ఉత్తరం, ఆగ్నేయ దిశ నుండి వీస్తున్న చలి గాలుల వల్ల చలి తీవ్రత పెరిగింది. ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణంతో చలి తీవ్రంగా పెరిగే అవకాశాలున్నాయి.
అంతేకాదు రాబోయే 2 రోజులు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలియజేసింది. రాబోయే రెండు మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
ఉదయం వేళ పొగమంచు కారణంగా ఉదయం వేళ రహదారులు కనపడటం లేదు. ముందుగా ఎవరొస్తున్నారన్నది తెలియడం లేదు. దీంతో వాహన దారులు అప్రమత్తంగా ఉండి వాహనాలు నడపాలని వాతావరణ శాఖ తెలియజేసింది.
ఉదయం సమయంతో పాటు రాత్రి పూట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుముఖం పట్టనున్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు కూడా దాటడం లేదు. ఉదయం 10 గంటల వరకు మంచు వీడకపోవడంతో ఉదయం కార్యాలయానికి వెళ్లేవారు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
ముఖ్యంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడే వృద్ధులు, చిన్న పిల్లలు చలికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్నింగ్ జాబ్స్ వెళ్లే రైతులు, కార్మికులు, విద్యార్ధులు ఇతర పనులు చేసుకునేవారు బయటకు వెళ్లడానికి భయపడుతున్నారు.