Investment Plan: లక్షాధికారి కావాలంటే చాలా సింపుల్.. నెలకు రూ. 3000 పొదుపు చేస్తే చాలు.. ఎలాగో తెలుసా


Investment Plan: మీరు లక్షాధికారి కావాలంటే చాలా సులభం. కేవలం రూ. 3000రూపాయలతో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే చాలు. మీరు 30ఏళ్ల తర్వాత  4.5కోట్లకు యజమాని అవుతారు. దీనికోసం మీరొక సాధారణ సూత్రాన్ని పాటించాల్సి ఉంటుంది. అదేంటో చూద్దాం. 
 

1 /5

Investment Plan: మీరు రిటైర్మెంట్ సమయంలో మీ మూలధనంపై మంచి రాబడిని పొందాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం మంచి ఆప్షన్. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం వల్ల వీలైనంత త్వరగా చేయాలని నిపుణులు చెబుతున్నారు. అంటే ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడం చిన్న వయస్సులోనే ప్రారంభించాలి. కొంతమంది నిపుణలు మొదటి ఉద్యోగం పొందిన వెంటనే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలని సలహా ఇస్తున్నారు.   

2 /5

30ఏళ్ల తర్వాత రూ. 4.5కోట్ల మొత్తాన్ని పొందేందుకు మీరు రోజుకు రూ. 100 నెలకు రూ. 3వేలు పెట్టుబడి పెట్టవచ్చు. మీ రిటైర్మెంట్ సమయంలో ఈ మొత్తం ఉపయోగపడుతుంది. మీరు ఈ ఫండ్ లో ఒక క్రమపద్ధతిలో పెట్టుబడి పెడితే అందులో పెట్టుబడి పెట్టడం వల్ల మీకు పూర్తి ప్రయోజనం లభిస్తుంది.   

3 /5

మ్యూచువల్ ఫండ్స్ అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే మీరు ఒకేసారి భారీ ప్రయోజనం పొందుతారు. అంటే 30ఏళ్లలో 15శాతంతోపాటు చక్రవడ్డీ ప్రయోజనం కూడా పొందుతారు. కానీ అంతకంటే ఎక్కువ అత్యంత కచ్చితమైన ఫార్మూలా అవసరం. ఇది సిప్ ను ప్రత్యేకంగా చేస్తుంది. ఈ ఫార్ములా స్టెప్ ఆప్ సిప్. మీరు చేయాల్సిందల్లా ప్రతి ఏడాది 10శాతం స్టెప్ ఆప్ రేటును ఉంచడం.  

4 /5

ఉదాహరణకు మీ వయస్సు 30ఏళ్లు అనుకుంటే మీరు ప్రతిరోజూ 100 రూపాయలు ఆదా చేసి సిప్ లో పెట్టుబడి పెట్టండి. మీరే 30ఏళ్ల పాటు దీర్ఘకాలిక వ్యూహాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. మీరు ప్రతి ఏడాది 10శాతం స్టెప్ ఆప్ కూడా చేస్తున్నారు. అంటే నెలకు 3000 రూపాయల పెట్టుబడితో ప్రారంభిస్తే వచ్చే ఏడాదిలో 300 రూపాయలు అంటే నెలకు 300 రూపాయలు పెంచాలి. ఇది 30ఏళ్ల పాటు కొనసాగుతుంది. 30ఏళ్ల తర్వాత మీరు రూ. 4, 50, 66, 809 మెచ్యూరిటీ మొత్తాన్ని పొందుతారు.   

5 /5

సిప్ కాలిక్యులేటర్ ప్రకారం 30ఏండ్లలో మీ మొత్తం పెట్టుబడి రూ. 59, 21, 785 అవుతుంది. కానీ ఇక్కడ రిటర్న్స్ మాత్రమే 3కోట్ల 91లక్షల 45 వేల రూపాయల ప్రయోజనాలు పొందుతుంది. దీన్ని సిప్ లో మేజిక్ ఆఫ్ రిటర్న్ అంటారు. ఈ స్టెప్ అప్ సహాయంతో మెచ్యూరిటీపై రూ. 4.50కోట్ల భారీ నిధి వస్తుంది.