హైదరాబాద్: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ (CoronaVirus) తెలంగాణలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 8 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కోవిడ్19 పాజిటీవ్ కేసుల సంఖ్య 13కు చేరుకుంది. ఇందులో ఏడుగురు ఇండోనేషియా పౌరులు కాగా, ఒకరు ఇటీవల స్కాట్కాండ్ నుంచి వచ్చిన మెదక్ యువకుడు కావడం గమనార్హం. కరోనా పాజిటీవ్ కేసులపై తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం (మార్చి 18) రాత్రి 10గంటలకు విడుదల చేసిన ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించింది.
మాస్కులు, గ్లోవ్స్ coronavirus ను ఆపలేవంటున్న నిపుణులు
ఇటీవల ఇండోనేషియా నుంచి 10 మంది పౌరులు కరీంనగర్‌కు వచ్చారు. వీరికి టెస్టులు నిర్వహించగా మంగళవారం ఒకరికి కరోనా పాజిటీవ్ అని తేలింది. మిగతా వారిని నగరంలోని ఛాతీ ఆస్పత్రికి తరలించి టెస్టులు నిర్వహించగా.. బుధవారం అందులో మరో ఏడుగురికి సైతం కరోనా పాజిటీవ్‌గా రావడం కరీంగనర్‌లో కలకలం రేపుతోంది. వీరితో పాటు వచ్చిన ఉత్తరప్రదేశ్ వ్యక్తికి కరోనా సోకలేదని పరీక్షల్లో తేలడం గమనార్హం.
‘క్రికెట్ కన్నా కుటుంబమే ముఖ్యం’
కాగా, మత కార్యక్రమాల కోసం కొన్ని రోజుల కిందట ఇండోనేషియా నుంచి వీరు భారత్‌కు వచ్చినట్లు సమాచారం. అనంతరం ఢిల్లీ నుంచి ఏపీ సంపర్క్ ఎక్స్‌ప్రెస్‌లో రామగుండం మీదుగా కరీంనగర్‌కు చేరుకున్నారు. మార్చి 16 నుంచి ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్న వీరిలో 8 మందికి కరోనా పాజిటీవ్‌గా తేలడంతో వీరు ఎవరిని కలిశారు, వైరస్ ఎంత మందికి సోకిందో అన్న అనుమానాలు ఆందోళన రేకెత్తిస్తోంది. కరీంనగర్లో 100 ప్రత్యేక బృందాలు కరీంనగర్‌కు వెళ్లి ప్రత్యేకంగా కరోనా పరీక్షలు నిర్వహించనున్నాయి.
కరోనాను వాడేస్తున్న పులిహోర రాజాలు..!
నేడు కీలక సమావేశం
కరీంనగర్లో కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో జరిగే ఈ అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు కరోనా వైరస్ నియంత్రణ, చర్యలపై ఏర్పాటు చేసే సమావేశంలో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..