Rashmika Mandanna Injured: రష్మిక మందన్న ఫుల్ జోష్ లో ఉంది. గత కొన్నేళ్లుగా వరుస ప్యాన్ ఇండియా మూవీస్ తో బాక్సాఫీస్ దుమ్ము దులుపుతుంది. తాజాగా ఈ భామ గాయాలపాలైంది. కాలి కట్టుకతో దిగిన ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.
Rashmika Mandanna Injured: రష్మిక మందన్న ప్రస్తుతం మన దేశంలో అసలు సిసలు ప్యాన్ ఇండియా స్టార్ కథానాయిక. లాస్ట్ ఇయర్ ‘పుష్ప 2’ తో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ను అందుకుంది. అంతకు ముందు ‘యానిమల్’, పుష్ప పార్ట్ 1 సినిమాలతో అన్ని ఇండస్ట్రీ వాళ్లకు ఫేవరేట్ అయింది.
తాజాగా రష్మిక మందన్న జిమ్ చేస్తుండగా అనుకోకుండా గాయాల పాలైంది. దీంతో కాలి కట్టు కట్టుకొని దిగిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. కొన్ని రోజులు షూటింగ్స్ కు దూరంగా ఉండాల్సి వస్తుందని వాపోయింది.
రష్మిక మందన్న శాండిల్ వుడ్ అయినా.. తెలుగులో ‘ఛలో’ చిత్రంతో పరిచయమైంది. ఈమె కర్ణాకటలోని కొడుగు జిల్లాలోని విరాజ్ పేటలో 1996 ఏప్రిల్ 5న జన్మించింది. అంతేకాదు అక్కడ స్థానికంగా ఉండే కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది.
ఇప్పటికే రష్మిక బాలీవుడ్ లో పుష్ప, యానిమిల్, తాజాగా పుష్ప 2 చిత్రాలతో రష్మిక క్రేజ్ ఆకాశాన్ని అంటింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1800 పైగా కోట్ల గ్రాస్ వసూల్లతో బాహుబలి 2 రికార్డులను బ్రేక్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమా కోసం రష్మిక తెలుగుతో పాటు కన్నడ, హిందీలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. ఓ రకంగా ఇపుడున్న కథానాయికలకు ఆదర్శంగా నిలుస్తుంది.
అటు బాలీవుడ్ లో సల్మాన్, మురుగదాస్ ‘సికిందర్’ సినిమాల్లో నటిస్తోంది. ఈ యేడాదే ఈ సినిమా విడుదల కాబోతుంది. రష్మిక మందన్న విషయానికొస్తే..హిందీ సినిమాల్లో నటించే ముందే 'టాప్ టక్కర్' ఆల్బమ్‌లో నటించి అక్కడ ప్రేక్షకులను సైతం మెప్పించింది.
రష్మిక ప్రస్తుతం ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు ప్రచారకర్తగా పనిచేస్తోంది. తనకున్న వరల్డ్ వైడ్ క్రేజ్ తో ఆ బ్రాండ్స్ కు ప్రచారం చేస్తోంది. రష్మిక ఎంఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నుండి కామర్స్, సైకాలజీలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు.