MP crisis: మా నాయకుడు చెబితే బావిలోనైనా దూకుతాం: కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు

మధ్యప్రదేశ్ రాజకీయాల్లో సంక్షోభం (MP political crisis) ముదురుతోంది. జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన అనంతరం కాంగ్రెస్ పార్టీ శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేడు వైఖరేంటో మరోసారి తేల్చిచెప్పారు.

Last Updated : Mar 17, 2020, 01:48 PM IST
MP crisis: మా నాయకుడు చెబితే బావిలోనైనా దూకుతాం: కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు

భోపాల్ : మధ్యప్రదేశ్ రాజకీయాల్లో సంక్షోభం (MP political crisis) ముదురుతోంది. జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన అనంతరం కాంగ్రెస్ పార్టీ శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేడు వైఖరేంటో మరోసారి తేల్చిచెప్పారు. జ్యోతిరాదిత్య సింధియానే తమ నాయకుడని.. ఆయన ఎక్కడుంటే ఎప్పుడూ తాము కూడా అక్కడే ఉంటామని కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు (Rebel Congress MLAs) స్పష్టంచేశారు. మంగళవారం బెంగుళూరులోని రిసార్ట్స్‌లో మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమర్తి దేవి (Imarti Devi).. జ్యోతిరాదిత్య సింధియా తమకు ఎంతో నేర్పించారని అన్నారు. ఆయనే తమ నాయకుడని.. అవసరమైతే ఆయన కోసం బావిలో దూకమన్నా దూకుతామని పేర్కొన్నారు. మరో తిరుగుబాటు ఎమ్మెల్యే గోవింద్ సింగ్ రాజ్‌పుత్ (Govind Singh Rajput) మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కమల్ నాథ్ (Kamal Nath) తమతో ఎప్పుడూ 15 నిమిషాలు కూడా సరిగ్గా మాట్లాడలేదని.. అటువంటప్పుడు తమ నియోజకవర్గంలో సమస్యలు, అభివృద్ధి గురించి ఇంకెవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తంచేశారు. జ్యోతిరాదిత్య సింధియాతోనే ఉంటామని స్పష్టంచేసిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు.. తమకు ప్రాణహానీ ఉందని, తమకు రక్షణ కావాలని డిమాండ్ చేశారు. 

జ్యోతిరాదిత్య సింధియానే లక్ష్యంగా చేసుకున్న వాళ్లు తమను మాత్రం ఎందుకు విడిచిపెడతారని.. సింధియాకే రక్షణ కరువైందంటే.. ఇక తమ ప్రాణాలకు గ్యారెంటీ ఎక్కడుందని రాజ్‌పుత్ ఆందోళన వ్యక్తంచేశారు. అందుకే తమకు రక్షణ కల్పించాలని అన్నారు. జైపూర్‌లో ఉన్న ఎమ్మెల్యేలు (Congress rebel MLAs in Jaipur) కూడా సంతోషంగా లేరని రాజ్‌పుత్ చెప్పుకొచ్చారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News