Anti Aging Fruits: ఈ పండ్లు తింటే నిత్య యవ్వనం, మీ ముఖంపై వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. అంతేకాదు నేచురల్‌గా మీ స్కిన్ మెరిసిపోతుంది. ముఖం యవ్వనంగా కనిపించటానికి వేలల్లో ఖర్చుపెట్టి పార్లర్ వెళ్తారు. అయితే దీని ప్రభావం కూడా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అది కాకుండా ఎక్కువ రసాయనాలు ఉపయోగిస్తారు. దీంతో ఒక్కోసారి మీ స్కిన్ డ్యామేజ్ అవ్వచ్చు. కొన్ని డైట్ లో మార్పులు చేర్చుకోవడం వల్ల ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. త్వరగా వృద్ధాప్య ఛాయలు మీ దరి చేరవు అలాంటి ఐదు రకాల పండ్లు ఏంటో తెలుసుకుందాం
మామిడిపండు..
మామిడిపండు డైట్ లో చేర్చుకోవడం వల్ల వృద్ధాప్య సమస్యలు త్వరగా దరిచేరవు. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి .అంతేకాదు ఇందులో యాంటీ మైక్రోబియన్ లక్షణాలు కూడా ఉంటాయి.. ముఖంపై జిడ్డు చర్మం ఉన్నవారు మచ్చలు, గీతలు ఉన్నవారు మామిడి పండ్లను తీసుకోవాలి. దీంట్లో ఫైబర్ కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది. అంతేకాదు ముఖంపై ఎరుపు దానం, మచ్చలు, చికాకుగా ఉంటే కూడా మామిడి పండ్లు తగ్గించేస్తాయి. జీర్ణ ఆరోగ్యానికి కూడా మామిడి పండ్లు ఎంతో మేలు చేస్తాయి.
బెర్రీ పండ్లు..
బెర్రీ పండ్లు ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మాని కూడా బోలేడు ప్రయోజనాలు అందిస్తుంది. బెర్రీ పండ్లు అంటే ముఖ్యంగా స్ట్రాబెరీ, బ్లూబెర్రీ, రాజ్బెరి వంటివి తీసుకోవటం వల్ల ముఖం యవ్వనంగా కనిపిస్తుంది. ఎందుకంటే పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి కూడా పుష్కలంగా ఉండటం వల్ల మీ ముఖం యవ్వనంగా కనిపిస్తుంది. ముఖంపై గీతలు లేకుండా చేస్తుంది. చర్మం డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. మీ చర్మం యవ్వనంగా కనిపిస్తుంది
బొప్పాయి..
బొప్పాయి కూడా ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మానికి కూడా మేలు చేస్తుంది. బొప్పాయిలో విటమిన్ ఏ, సి ఉంటుంది ఇందులో పప్పైన్ అనే ఎంజైమ్ ఉండటం వల్ల ముఖానికి మంచి ఎక్స్‌ఫోలియేటర్ లాగా పనిచేస్తుంది. ముఖం పై ట్యాన్ తొలగిస్తుంది. మీ ముఖానికి సహజమైన గ్లో అందిస్తుంది. బొప్పాయిలో ముఖానికి మాయిశ్చర్ అందించే గుణాలు ఉంటాయి.
ఇదీ చదవండి : మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డులు లింక్ అయి ఉన్నాయి? ఇలా చెక్ చేసుకోండి..
యాపిల్స్..
యాపిల్ లో కూడా విటమిన్ ఏ, సీ పుష్కలంగా ఉంటాయి. వీటిని డైట్ లో చేర్చుకోవడం వల్ల మన చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. త్వరగా వృద్ధాప్య ఛాయలు రావు. యాపిల్స్ ఫైబర్ కంటెంట్ అతిగా ఉంటుంది. జీర్ణ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. యాపిల్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మీ ముఖం నిత్య యవ్వనంగా మెరిసిపోవాలంటే యాపిల్ డైట్లో చేర్చుకోవాల్సిందే.
ఇదీ చదవండి : బాదం అతిగా తింటే కలిగే 4 అనర్థాలు ఏంటో తెలుసా?
దానిమ్మ..
దానిమ్మ కూడా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖం మెరిసిపోయేలా ప్రోత్సహిస్తుంది. ఇది ఆక్సిడేటీవ్ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. దీంట్లో మీ చర్మం నిత్య యవ్వనంగా మెరిసిపోతుంది. ముఖ్యంగా చలికాలంలో దానిమ్మ తినడం వల్ల ముఖం సహజ సిద్ధమైన గ్లో మీ ముఖానికి అందుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook