అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను సోమవారం రాజ్‌భవన్‌లో కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడానికి గల కారణాలను గవర్నర్‌కు ఈసీ వివరించారు. వాయిదా వేయడానికి తలెత్తిన కారణాలను సైతం గవర్నర్‌కు వివరించినట్లు సమాచారం. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం, తదితర విషయాలను కారణాలుగా చూపినట్లు తెలుస్తోంది.
Read also : కరోనా వైరస్ పోయినా శానిటైజర్స్ వాడాల్సిందే.. ఎందుకో తెలుసా?
ఒకవేళ గవర్నర్ ఆదేశిస్తే తొలుత నిర్ణయించిన షెడ్యూలు ప్రకారమే ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ రమేష్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రభుత్వంతోగానీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోగానీ ఎలాంటి చర్చలు జరపకుండా అనూహ్యంగా స్థానిక ఎన్నికల్ని రమేష్ కుమార్ వాయిదా వేయడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం తెలిసిందే. ఎన్నికల వాయిదా నేపథ్యంలో గవర్నర్‌కు సీఎం జగన్ ఇదివరకే ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఈసీ రమేష్ కుమార్ రాజ్‌భవన్‌కు పిలిపించి ఎన్నికల వాయిదాపై గవర్నర్ చర్చించారు.
See Photos: అందమైన భామలు.. లేత మెరుపు తీగలు
కాగా, ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాలపాటు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఆదివారం దీనిపై ప్రకటన జారీ చేయడం గమనార్హం. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రస్తావించారు. కానీ రాష్ట్రంలో కరోనా కేసులే లేవని, అలాంటిది ఏ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేశారో చెప్పాలని సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై మరోసారి ఉత్కంఠ నెలకొంది.
Also Read: ఎన్నికల కమిషన్ పై వైఎస్ జగన్ ఫైర్
జడ్పీటీసీ ఎన్నికలకు దాఖలైన నామినేషన్స్.. జిల్లాల వారీగా వివరాలు