'కరోనా వైరస్' ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా వ్యాపిస్తోంది. ధనిక, పేద, మధ్యతరగతి, ఆడ, మగ, పిల్లలు, వృద్ధులు.. ఇలా ఎవరినీ వదలడం లేదు. రాజకీయ ప్రముఖులైనా, సినీ ప్రముఖులైనా ఎవరికీ తప్పని పరిస్థితి. దీంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల ప్రజలు కరోనా వైరస్ అంటే గజగజలాడిపోతున్నారు.
'కరోనా వైరస్' అగ్ర రాజ్యం అమెరికాను కూడా వణికిస్తోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అమెరికాలో 2 వేలు దాటింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్రావెల్ బ్యాన్ విధించారు. దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. దీంతో అమెరికాకు 27 దేశాల నుంచి రాకపోకలు ఆగిపోయాయి. అంతే కాదు అధ్యక్షుడు ట్రంప్ కూడా కరోనా వైరస్ పరీక్షలు చేయించుకుంటానని చెప్పారు. ఆయన అన్నంత పనీ చేశారు. నిన్న వైట్ హౌస్ వైద్యుల బృందం పర్యవేక్షణలో కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు కరోనా వైరస్ పరీక్షల్లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో వైట్ హౌస్ సహా అమెరికన్లంతా ఊపిరిపీల్చుకున్నారు.
Read Also: అప్పుడే పుట్టిన బిడ్డకు కరోనా వైరస్..!!
ట్రంప్.. ఇటీవలే బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారోతోపాటు ఆయన కమ్యూనికేషన్ చీఫ్ ఫాబియోను కలిశారు. అందులో ఫాబియోకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. దీంతో ట్రంప్ కూడా కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్నారు. కానీ ఆయనకు కరోనా వైరస్ సోకలేదని నిర్ధారణ అయింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..