gold price raise again : బాబోయ్..బంగారం భగ.. భగ..!!

బంగారం ధరకు మళ్లీ రెక్కలొస్తున్నాయి. పసిడి రేటు అంతకంతకూ పెరుగుతోంది. ధగధగలాడే బంగారం. . ధర మాత్రం భగ్గుమంటోంది. కరోనా వైరస్ దెబ్బకు అంతర్జాతీయంగా మార్కెట్లన్నీ కుదేలవుతుంటే. .  బులియన్ మార్కెట్ మాత్రం పరుగులు పెడుతోంది. 

Last Updated : Mar 7, 2020, 12:28 PM IST
gold price raise again : బాబోయ్..బంగారం భగ.. భగ..!!

బంగారం ధరకు మళ్లీ రెక్కలొస్తున్నాయి. పసిడి రేటు అంతకంతకూ పెరుగుతోంది. ధగధగలాడే బంగారం. . ధర మాత్రం భగ్గుమంటోంది. కరోనా వైరస్ దెబ్బకు అంతర్జాతీయంగా మార్కెట్లన్నీ కుదేలవుతుంటే. .  బులియన్ మార్కెట్ మాత్రం పరుగులు పెడుతోంది.  

బంగారం ధర పైపైకి వెళ్తోంది. కరోనా వైరస్ దెబ్బకు ఆదిలో కాస్త వెనుకబడ్డ బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. ఇవాళ పసిడి ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర వెయ్యి 20 రూపాయలు పెరిగింది. దీంతో మార్కెట్లో పసిడి ధర 46 వేల 160 రూపాయలకు చేరింది. ఐతే ఇప్పటి వరకు ఇదే ఆల్ టైమ్ రికార్డు స్థాయి  ధర కావడం విశేషం. మరోవైపు 22 క్యారెట్ల బంగారం కూడా బాగా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 950 రూపాయలు పెరిగి 42 వేల 310 రూపాయలకు చేరుకుంది.

Read Also: అప్పుడలా.. ఇప్పుడిలా..!!

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 1675 డాలర్లకు సమీపంలోకి చేరింది. దీంతో బంగారం ధర ఔన్స్ కు 0.38 శాతం పెరుగుదలు పెడుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ పెరగడం, బులియన్ మార్కెట్లో మదుపరులు పసిడిపై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి  చూపించడంతో బంగారం ధరలు రెక్కలు వచ్చాయి. రోజు రోజుకు ఆకాశానికి ధరలు పెరుగుతున్నాయి. దీంతో ప్రస్తుతం బంగారం కొనుగోళ్లపై సామాన్య ప్రజలు ఆసక్తి చూపించడం లేదు. ఫలితంగా జ్యువెల్లరీ మార్కెట్లు వెలవెలబోతున్న పరిస్థితి కనిపిస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News