న్యూ ఢిల్లీ : ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నుంచి ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ రేట్లపై ఎలాంటి ప్రకటన వస్తుందా అని 6 కోట్ల మంది ఖాతాదారులు వేచిచూస్తున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్ వడ్డీ రేటు 8.65% కాగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్ వడ్డీ రేటులో ( PF interest rates ) కోత విధించి 8.5% వడ్డీ రేటు మాత్రమే అందించాలని పీఎఫ్ఓ యోచిస్తున్నట్టుగా వార్తలు వెలువడమే పిఎఫ్ ఖాతాదారుల ( EPF subscribers ) ఆందోళనకు కారణమైంది. అయితే, తాజాగా పీటీఐ వెల్లడించిన ఓ కథనం ప్రకారం ఈ ఏడాది కూడా 8.65% కొనసాగించాలని కార్మిక శాఖ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అదే కానీ నిజమైతే.. పీఎఫ్ వడ్డీ రేటుపై ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మార్చి 5న జరగనున్న సెంట్రల్ బోర్డ్ ట్రస్టీల ( Central Board of Trustees ) సమావేశంలో నిర్ణయం తీసుకుంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. ఈ అంశంపై ఇంకా సరైన స్పష్టత లభించడం లేదు.
ఇదివరకు ఈపీఎఫ్ నిధి కింద జమ అయిన మొత్తంపై ఇచ్చిన వడ్డీ రేట్ల విషయానికొస్తే.. 2016-17లో 8.65 శాతం, 2017-18లో 8.55% వడ్డీ రేటు అమలు చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..