Smitha sabharwal: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై పీసీ ఘోష్ కమిషన్ స్పీడ్ పెంచింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో సంబంధమున్న అధికారులను వారం రోజులుగా పీసీ ఘోష్ కమిషన్ విచారిస్తోంది. తాజాగా మాజీ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి, మాజీ ఇరిగేషన్ సెక్రటరీ రజత్ కుమార్‌ను విచారించింది. ఆ తర్వాత రోజున మాజీ సీఎస్ సోమేష్ కుమార్, ప్రస్తుతం టూరిజం శాఖ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్‌ను విచారణకు వచ్చారు. దాంతో కమిషన్ చైర్మన్ పలు ప్రశ్నలు సంధించినట్టు తెలిసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. మూడు భాగాలుగా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణం చేసింది. అయితే ప్రాజెక్టు నిర్మాణం జరిగిన కొద్దిరోజులకే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లకు పగుళ్లు రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దాంతో అప్పట్లో బ్యారేజీలకు సంబంధించి అనుమతుల విషయంలో కీలకంగా వ్యవహరించిన అధికారులను విచారిస్తున్నారు. తాజాగా మాజీ సీఎస్‌ను సోమేష్ కుమార్‌ను విచారించిన కమిషన్.. మూడు బ్యారేజీల విషయంలో ఏమైనా డీల్ చేశారా అని ప్రశ్నించినట్టు తెలిసింది. అయితే తాను సీఎస్‌గా బాధ్యతలు తీసుకునే సమయానికి బ్యారేజీల నిర్మాణం మొత్తం పూర్తయిందని సోమేష్ కుమార్ చెప్పినట్టు తెలిసింది. అనంతరం స్మితా సబర్వాల్‌ను కూడా కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ విచారించారు.. కాళేశ్వరంలో ఆమె పాత్ర గురించి పలు ప్రశ్నలు సంధించినట్టు తెలిసింది.
అయితే ఇక్కడే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కాళేశ్వరం కేసులో ఎలాంటి పాత్రలేని స్మితా సబర్వాల్‌ను ఎందుకు విచారణకు పిలుస్తున్నారు.. ఆమెను అనసవరంగా ఈ కేసులోకి లాగుతున్నారా అనే ప్రశ్నలు ఎదురువుతున్నాయి. స్మితా సబర్వాల్‌పై మీడియా ట్రయల్ ఏమైనా జరుగుతోందా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో స్మితా సబర్వాల్ సీఎంవోలో సెక్రటరీగా పనిచేశారు. అప్పటి సీఎం కేసీఆర్‌కు పర్సనల్ సెక్రటరీగా సేవలందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు.. ప్రాజెక్టు నిర్మాణం, ఇతర వ్యవహారాలన్నీ అప్పటి సీఎస్ ఎస్కే జోషి, ఇరిగేషన్ సెక్రటరీ రజత్ కుమార్, ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు ఆదేశాల మేరకే జరిగాయి. ఆనాడు స్మితా సబర్వాల్ సీఎంవోలో పనిచేసినప్పటికీ ఆమె రోల్ లిమిటెట్ మాత్రమే. ఆనాడు నిర్మాణ సమయంలో ఏమైనా తప్పిదాలు జరిగితే అందుకు సంబంధించిన సమాచారాన్ని అప్పటి సీఎం కేసీఆర్‌కు ఇవ్వడమే స్మితా సబర్వాల్ డ్యూటీ. అంతేతప్ప ఆమె ఇన్వాల్వ్ మెంట్ ఎక్కడ లేదని చెబుతున్నారు. కానీ.. స్మితా సబర్వాల్ విషయంలో మాత్రం అనవసరంగా మీడియా ట్రబల్ జరుగుతోందని చెబుతున్నారు..
వాస్తవానికి తెలంగాణలో ఉన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లలో స్మితా సబర్వాల్ ఒకరు. గతంలో మెదక్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో స్మితా సబర్వాల్‌ను అప్పటి సీఎం కేసీఆర్ ఏరికోరి మరి సీఎంవో లోకి తీసుకున్నారు. కానీ ఆమె ఏనాడు కూడా పూర్తిస్థాయిలో ఇరిగేషన్ సెక్రటరీగా పని చేయలేదు. కానీ.. గతేడాది ఇరిగేషన్ సెక్రటరీ రజత్ కుమార్ రిటైర్ అయ్యాక.. 2023 నవంబర్ 30వ తేదీ నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు పనిచేశారు. అంటే కేవలం 6 రోజులు మాత్రమే ఇరిగేషన్ సెక్రటరీగా సేవలందించారు. ఇక డిసెంబర్ ఏడో తేదీన రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేయడంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ఆదేశించారు. అయితే అప్పటివరకు సీఎంవోలో పనిచేస్తున్న స్మితా సబర్వాల్.. ఫెన్సాన్స్ కమిషన్‌కు బదిలీ చేశారు.. అనంతరం కొద్దినెలల తర్వాత స్మితా సబర్వాల్‌ను టూరిజం శాఖ సెక్రటరీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..
మరోవైపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే స్మితా సబర్వాల్ ముఖ్యమంత్రిని కలవలేదు. ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా చాలా మంది అధికారులు కలిశారు. కానీ స్మితా మాత్రం సీఎంను కలిసేందుకు ఆసక్తి చూపలేదు. దాంతో ఆమెను పక్కన పెట్టేశారని టాక్ వినిపించింది. ఆ తర్వాత స్మితాకు ఫైనాన్స్ కమిషన్‌లో పోస్టింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఆమెను తిరిగి టూరిజం డిపార్ట్మెంట్కు బదిలీ చేశారు. అయితే టూరిజం పెక్రటరీగా బాధ్యతలు స్వీకరించగానే.. స్మితా సబర్వాల్ తనదైన మార్క్ చూపించారు. ఆమె టూరిజం శాఖలో బాధ్యతలు స్వీకరించగానే మహారాష్ట్ర ఎన్నికల కోసం స్పెషల్ డ్యూటీకి వెళ్లారు. ఆ తర్వాత తిరిగొచ్చి మళ్లీ టూరిజం శాఖలో బిజీబిజీ అయిపోయారు. అయితే తెలంగాణ కొత్త రాష్ట్రంగా అవతరించాక.. ఇప్పటివరకు టూరిజం పాలసీ లేదు.. కానీ స్మితా బాధ్యతలు చేపట్టాకే కేవలం మూడురోజుల్లోనే టూరిజం పాలసీని రూపొందించి శభాష్ అనిపించుకున్నారని తెలిసింది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే స్మితా రూపొందించిన టూరిజం పాలసీపైనే చర్చ కూడా జరిగింది. దాంతో స్మితా సబర్వాల్ పనితీరు ఎలా ఉంటుందో ఈ ఒక్క ఉదహరణ చాలాని ప్రభుత్వ వర్గాల్లోనే చర్చ జరుగుతోందని చెబుతున్నారు.
Also Read: Allu Arjun Police Station: పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్.. ప్రశ్నలతో బన్ని ఉక్కిరి బిక్కిరి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.