Honda Activa 7G Features: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హోండా మార్కెట్లో తనదైన శైలిలో ముద్ర వేసుకుంది. ముఖ్యంగా మోటార్ సైకిల్స్ విభాగంలో అద్భుతమైన బైక్‌లను విడుదల చేస్తూ ముందుకు వెళ్తోంది. అయితే స్కూటర్స్ విభాగంలో త్వరలోనే ఎలక్ట్రిక్ వేరియంట్ లో కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఎంతో ప్రాముఖ్యత పొందిన హోండా యాక్టివా అతి త్వరలోనే సెవెన్ జి వేరియంట్ లో విడుదల కాబోతోంది. ఇది గత స్కూటర్ తో పోలిస్తే ఎన్నో రకాల ఫీచర్స్ తో అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే ఈ స్కూటర్ కు సంబంధించిన అతి కొద్ది వివరాలను కంపెనీ వెల్లడించింది. అయితే ఈ స్కూటర్ ఎప్పుడు విడుదలవుతుందో.. ఈ స్కూటర్ కు సంబంధించిన ఫీచర్స్ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ గా పేరుగాంచిన హోండా యాక్టివా ఇప్పుడు సెవెన్ జి వేరియంట్ లో కూడా అందుబాటులోకి రాబోతోంది. అయితే ఇది కొత్త అద్భుతమైన డిజైన్‌తో పాటు మంచి పనితీరు, లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్స్ వంటి కొత్త కొత్త హంగులతో ఈ స్కూటర్ లాంచ్ కాబోతోంది. ముఖ్యంగా దీని డిజైన్ వివరాల్లోకి వెళితే.. హోండా కంపెనీ గతంలో విడుదల చేసిన యాక్టివా 6జి 5జి వంటి డిజైన్స్ కంటే త్వరలో విడుదల కాబోయే సెవెన్ జి డిజైన్ చాలా కొత్తగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవలే ఈ స్కూటర్ కు సంబంధించిన కొన్ని ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇందులో చాలా ఫోటోల్లో మీరు బైకును సిల్వర్ కలర్ లో ఉండడం గమనించవచ్చు. అంతేకాకుండా ఇది ముందు భాగంలో హైలెట్ డిజైన్ ను కలిగి ఉంది.
ఇక హోండా సెవెన్ జి ఫీచర్స్ వివరాల్లోకి వెళితే... దీనిని స్పోర్ట్ స్కూటర్ విభాగంలో అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఎన్నో శక్తివంతమైన ఫీచర్లను జోడించినట్లు తెలుస్తోంది. మొదటగా ఈ స్కూటర్లో LED హెడ్‌ల్యాంప్‌ల వివరాల్లోకి వెళితే.. కంపెనీ ఇందులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సిగ్నేచర్ LED DRLలను (డేటైమ్ రన్నింగ్ లైట్స్) అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతేకాకుండా హోండా తన వినియోగదారుల కోసం స్టైలిష్ స్టైలిష్ టెయిల్ లైట్స్ ను తీసుకువచ్చింది. అలాగే మారుతున్న టెక్నాలజీకి అనుకూలంగా ఇంకెన్నో అద్భుతమైన ఫీచర్లను ఈ హోండా యాక్టీవ 7జి కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.
హోండా సెవెన్ జి స్కూటర్ మొత్తం మూడు రంగుల్లో అందుబాటులో ఉండబోతున్నట్లు సమాచారం. ఈ స్కూటర్ రంగులను బట్టి రేటు ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన రంగుల వివరాల్లోకి వెళితే.. Activa 7G మాట్ యాక్సిస్ గ్రే, పెర్ల్ నైట్ స్టార్ బ్లాక్ తో పాటు కొత్త మెటాలిక్ బ్లూ ఇలా మూడు రంగులను కలిగి ఉంది. రైడర్స్‌ను ఆకర్షించేందుకు ఈ స్కూటర్లో ప్రత్యేకమైన సీటింగ్ కెపాసిటీని తీసుకువచ్చింది. గతంలో విడుదల చేసిన యాక్టివా వేరియంట్స్ సీట్స్ కంటే ఇందులో ఎంత దూరమైనా ప్రయాణించేందుకు అనుగుణంగా ఉండే సీటింగ్ కెపాసిటీని తీసుకువచ్చింది. ఇవే కాకుండా honda 7g యాక్టీవ్‌లో అనేక రకాల కొత్త ఫీచర్స్ అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.