Ttd Calendars And Diaries 2025: టీటీడీ 2025 ఏడాది క్యాలెండర్లు, డైరీస్ ఆర్డర్‌ చేసుకున్నారా? చేసుకోని వారు ఇలా చేసుకోండి..

Ttd Calendars And Diaries 2025 Order Now In Online: తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కొత్త సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్లు, డైరీస్ టీటీడీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చాయి. వీటిని సులభంగా వెబ్ సైట్ లోనే ఆర్డర్ చేసుకునే సదుపాయాన్ని టీటీడీ కల్పించింది. అయితే వీటిని ఎలా ఆర్డర్ చేసుకోవాలో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Dec 24, 2024, 05:22 PM IST
Ttd Calendars And Diaries 2025: టీటీడీ 2025 ఏడాది క్యాలెండర్లు, డైరీస్ ఆర్డర్‌ చేసుకున్నారా? చేసుకోని వారు ఇలా చేసుకోండి..

Ttd Calendars And Diaries 2025 Order Now In Online: తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు గుడ్ న్యూస్ తెలిపింది. ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ఏడాదికి సంబంధించిన క్యాలెండర్స్ డైరీలను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. గతంలో ఆఫ్‌లైన్, పోస్టల్ సేవల ద్వారా వీటిని కొనుగోలు చేయాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం ఆన్లైన్ లోనే ఎంతో సులభంగా క్యాలెండర్స్ తో పాటు డైరీలను ఆర్డర్ చేసుకోవచ్చని టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. వచ్చే 2025 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ ల పై తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి ఫోటోతో పాటు 12 పేజీల క్యాలెండర్, సింగిల్ పేజ్ క్యాలెండర్, 6 పేజీల క్యాలెండర్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన క్యాలెండర్లు, డైరీలను మీరు కూడా ఆన్లైన్ ద్వారా అప్లై చేసి తెప్పించుకోవాలనుకుంటున్నారా? ఇలా సులభంగా అప్లై చేసుకోండి.

 
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకమైన వెంకటేశ్వర స్వామి క్యాలెండర్స్‌లో భాగంగా.. శ్రీ పద్మావతి అమ్మవారికి సంబంధించిన పెద్ద సైజు క్యాలెండర్లు, శ్రీ వేంకటేశ్వర స్వామి తిరుపతిలో కొలువుదీరిన అవతారము, శ్రీ పద్మావతి సమేతంగా ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి పెద్ద సైజు క్యాలెండర్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపింది. ఇక డైరీ విషయానికొస్తే.. సతీ సమేతంగా ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఫోటోతో డీలక్స్ డైరీలు, చిన్న సైజు డైరీలను టీటీడీ ఆన్లైన్లో విక్రయాలకు ఉంచింది. ఈ డైరీలను ఆన్లైన్లోనే సులభంగా కొనుగోలు చేయాలనుకునేవారు నేరుగా https://www.tirumala.org/ లేదా https://ttdevasthanams.ap.gov.in/ వెబ్‌సైట్ల లింకులను ఓపెన్ చేసి బుక్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది.

అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, చెన్నై, న్యూఢిల్లీ, ముంబాయిలోని కొన్ని ప్రముఖ స్టోర్లలో కూడా ఈ క్యాలెండర్స్ తో పాటు డైరీలను అందుబాటులో ఉంచినట్లు తెలుస్తోంది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కొన్ని కళ్యాణ మండపాల్లో కూడా వీటిని విక్రయాలకు ఉంచినట్లు టీటీడీ చైర్మన్ తెలిపారు. క్యాలెండర్స్ తో పాటు డైరీలను సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్లో మార్పులతో కొంత సులభతరం చేసింది. అయితే వీటికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

డైరీలతో పాటు క్యాలెండర్స్ కు ఇలా దరఖాస్తు చేసుకోండి: 
మొదటగా పైన పేర్కొన్న రెండు వెబ్సైట్లో ఏదైనా ఒక వెబ్సైట్ని(https://ttdevasthanams.ap.gov.in/) ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఆ లింకును ఓపెన్ చేయగానే పూర్తిగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వెబ్సైట్ పూర్తిగా ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత అందులో మీరు పైన కనిపిస్తున్న లాగిన్ ఆప్షన్ను నొక్కి మీ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. 

ఇలా లాగిన్ అయిన తర్వాత పూర్తిగా మిమ్మల్ని టీటీడీకి సంబంధించిన అధికారిక వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది. అయితే ఇక్కడే మీకు సర్వీస్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఈ ఆప్షన్ కు కొంచెం కిందికి రాగానే మీరు డైరీలు, calendar అనే ఆప్షన్ గమనిస్తారు. అయితే వీటిపై క్లిక్ చేయగానే.. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు కనిపిస్తాయి. 

ఆ తర్వాత వాటిని మీరు ప్రత్యేకమైన ఆప్షన్స్ చూస్ చేసుకొని కొనుగోలు చేసేముందు.. కొన్ని ఆప్షన్స్ను మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. భారత్కు సంబంధించిన వారైతే.. ఐటమ్ షిప్పింగ్ కోసం భారత్ అనే ఆప్షన్ను చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. 

ఇలా చూస్ చేసుకున్న తర్వాత పూర్తి అడ్రస్ ను అందులో ఫిల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇలా ఫీల్ చేసిన తర్వాత మీరు చూస్ చేసుకున్న ఐటమ్ ను బట్టి ధర చూపించడం మీరు గమనించవచ్చు.

ఆ తర్వాత ఇలా అన్ని కంప్లీట్ చేసుకున్న వెంటనే మీకు పేమెంట్ ఆప్షన్ కూడా కనిపిస్తూ ఉంటుంది. నేరుగా మీరు కొనుగోలు చేసిన క్యాలెండర్ లేదా డైరీ కి డబ్బులు పే చేయవచ్చు.

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News