Mohammed Shami Sania Mirza Both Are Getting Second Marriage: క్రికెట్ టెన్నీస్ కలవనున్నావా అంటే ఔననే సమాధానం వస్తోంది. త్వరలోనే మాజీ క్రికెటర్ మహ్మద్ షమీ, టెన్నీస్ మాజీ ప్లేయర్ సానియా మీర్జా పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం. వీరిద్దరూ క్రిస్మస్ వేడుకల్లో కలిసి పాల్గొనడంతో వారి పెళ్లి ఖాయమే అనే వార్తలు వస్తున్నాయి.
దుబాయ్‌లో మహమ్మద్ షమీ, సానియా మీర్జా కలిశారనే వార్త క్రీడా రంగంలో చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో ఎడిట్ అవుతూ క్రిస్మస్ స్వీట్ న్యూస్‌గా వైరల్ అవుతున్నాయి.
భారత క్రికెటర్ మహ్మద్ షమీ తన భార్య హసిన్ జహాన్‌కు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోలేదు. తనకు ఏ స్త్రీ పట్ల ఆసక్తి లేదని తేల్చేశాడు.
హసిన్ జహాన్ తనపై తీవ్ర ఆరోపణలు చేసి.. న్యాయస్థానంలో ఇబ్బందులకు గురి చేసినా కూడా టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ ధైర్యంగా ఎదుర్కొన్నాడు. వ్యక్తిగత జీవితంలో ఇంత ఇబ్బందిని తట్టుకుని నిలబడి అనంతరం క్రికెట్లో గొప్పగా బౌలింగ్ చేస్తున్నాడు.
మహ్మద్ షమీ మళ్లీ పెళ్లి చేసుకుంటాడనే వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను షమీ పెళ్లి చేసుకోనున్నాడని పుకార్లు వస్తున్నాయి. అయితే ఈ పుకార్లపై షమీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
పాకిస్థాన్ ఆటగాడు షోయబ్ మాలిక్‌తో సానియా మీర్జా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. తన వైవాహిక జీవితానికి గుడ్‌బై చెప్పి భారత్‌కు తిరిగి వచ్చారు. ఆమె ఇప్పటివరకు మరో పెళ్లి చేసుకోలేదు. భారత్‌లో టీమిండియా మ్యాచ్ జరుగుతున్న సమయంలో సానియా స్టేడియానికి వచ్చి క్రికెట్ వీక్షించింది.
స్టేడియంలో క్రికెట్ చూస్తున్న సమయంలో షమీ ఆటను చూసి సానియా మీర్జా షాకైనట్లు సమాచారం. ఆ సమయంలో షమీతో సానియా మాట్లాడిందని తెలుస్తోంది. అనంతరం వీరిద్దరూ కొన్ని కార్యక్రమాల్లో కనిపించారు.
ఇప్పుడు వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు బయటకు వచ్చాయి. ఈ సమయంలో ఏఐతో ఎడిట్ చేసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో కలకలం రేపాయి. క్రిస్మస్ వేడుకల్లో వీరిద్దరూ పాల్గొన్నారని వార్త హల్చల్ చేసింది.
ఈ ఫొటోలను పరిశీలించగా ఇది ఎడిట్ చేసిన ఫొటో అని తేలింది. ఏఐ ద్వారా ఇలా చేశారని తెలిసి అవాక్కయ్యారు. కానీ సానియా, షమీ పెళ్లి చేసుకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని నెటిజన్లు వ్యక్తం చేశారు.