Marco: ప్యాన్ ఇండియా లెవల్లో దుమ్ము లేపుతున్న ఎన్టీఆర్ బ్రదర్ మూవీ ‘మార్కో’.. బాహుబలి, కేజీఎఫ్ సినిమాల సరసన..

Marco Movie: అవును ఎన్టీఆర్ బ్రదర్ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో దుమ్ము లేపుతోంది. ఇంతకీ ఎన్టీఆర్ బ్రదర్ ఎవరనుకుంటున్నారా.. అదేనండి. జనతా గ్యారేజ్ సినిమాలో తారక్ బ్రదర్ పాత్రలో నటించిన ఉన్ని ముకుందన్ నటించిన ‘మార్కో’ మూవీ మల్లూవుడ్ తో పాటు ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 23, 2024, 04:25 PM IST
Marco: ప్యాన్ ఇండియా లెవల్లో దుమ్ము లేపుతున్న ఎన్టీఆర్ బ్రదర్ మూవీ ‘మార్కో’.. బాహుబలి, కేజీఎఫ్ సినిమాల సరసన..

Marco Movie: గత కొన్నేళ్లుగా తెలుగు సహా అన్ని ఇండస్ట్రీస్ జనాలు ప్యాన్ ఇండియా జపం చేస్తున్నారు. ఈ ప్యాన్ ఇండియా మార్కెట్ లో తెలుగు సినిమా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. రెండో స్థానంలో కన్నడ ఇండస్ట్రీ ఉంది. ఆ తర్వాత తమిళ, మలయాళ ఇండస్ట్రీ వాళ్లు ప్యాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.  ఈ కోవలో ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన ‘మార్కో’ మూవీ ఇపుడు మలయాళ సినీ ఇండస్ట్రీలో కలెక్షన్స్ తో రచ్చ లేపుతోంది. అంతేకాదు బాహుబలి, కేజీఎఫ్ సినిమాలు ఆయా చిత్ర పరిశ్రమలకు ఎలా గుర్తింపు తీసుకొచ్చాయో.. ఇపుడు మార్కో మూవీ మలయాళ సినీ ఇండస్ట్రీ పేరును ప్యాన్ ఇండియా లెవల్లో మారుమ్రోగేలా చేయడం గ్యారంటీ అంటున్నారు.

అంతేకాదు హిందీలో ‘మార్కో’ మూవీ థియేట్రికల్ గా రిలీజై అక్కడ కూడా సత్తా చాటుతోంది.ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో ‘మార్కో’ హిందీ వెర్షన్ కు మంచి స్పందన లభిస్తోంది. అది వసూళ్ల రూపంలో కనిపిస్తోంది. ప్రెజెంట్  భారతీయ సినిమాల్లో ప్యాన్ ఇండియా సక్సెస్ అంటే.. రూ 1000 కోట్ల క్లబ్బులో చేరడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా  హిందీ, తెలుగు, తమిళ, కన్నడ సినిమాలు స్థానం దక్కించుకున్నాయి. కానీ మలయాళం నుంచి ఇప్పటివరకు ఏ సినిమా కూడా చోటు దక్కించుకోలేదు. ఈ లోటును భర్తీ చేసే బాధ్యతను "మార్కో" తీసుకుంది.
ఈనెల 20న విడుదలైన ఈ మూవీ మలయాళంలో వసూళ్ల సునామి సృష్టిస్తోంది.  తొలిసారి హిందీలో థియేట్రికల్ రిలీజైన  "మార్కో" అక్కడ కూడా బాక్సాఫీష్ దగ్గర వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఉన్ని ముకుందన్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రాన్ని హనీఫ్ అదెని డైరెక్ట్ చేశారు. క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై షరీఫ్ మహ్మద్ నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో హిందీ వెర్షన్ కు లభిస్తున్న రెస్పాన్స్ ను  దృష్టిలో ఉంచుకుని.. ఈ చిత్రాన్నిఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేసేందుకు "జినీవర్స్" సంస్థ సన్నాహాలు చేస్తోంది.

"జినీవర్స్" అధినేత బల్వంత్ సింగ్ మాట్లాడుతూ... "బాహుబలి, కె.జి.ఎఫ్, కాంతార... తాజాగా పుష్ప-2" చిత్రాలు ప్యాన్ ఇండియా మార్కెట్ ను షేక్ చేసిన సంగతిని గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా ‘మార్కో’ మూవీ  గురించి మాట్లాడుకుంటారని చెప్పారు.  మన రెండు తెలుగు రాష్ట్రాలలో "మార్కో" హిందీ వెర్షన్ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అందుకే త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని థియేటర్లు పెంచబోతున్నట్టు చెప్పారు.

ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News