Akai Kohli's viral photo: విరాట్ కోహ్లీ కొడుకు అకాయ్ పిక్ చూశారా? ఎంత ముద్దుగా ఉన్నాడో..ఇదిగో ఫొటో

 Akai Kohli's viral photo:  ఎట్టకేలకు విరాట్ కోహ్లీ, అనుష్కల ముద్దుల కుమారుడు అకాయ్ ఫోటో బయటకు వచ్చింది.  ఇటీవల విరాట్ కోహ్లి తన బిడ్డ ఫోటోను క్లిక్ చేయవద్దని ఓ విదేశీ జర్నలిస్టుతో గొడవపడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా విరాట్ కొడుకు ఫొటో లీక్ అయ్యింది. అకాయ్ పుట్టిన 11నెలలకు ఆయన ఫొటో బయటకు రావడంతో..అకాయ్ ఫొటో చూసిన నెటిజన్లను ఎంత ముందుగా ఉన్నాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 
 

1 /6

విరాట్ కోహ్లీ ఇటీవల ఓ విదేశీ జర్నలిస్టును  అనుమతి లేకుండా తన బిడ్డ ఫోటోను క్లిక్ చేయరాదని వాదించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.  

2 /6

అయితే దీని తర్వాత ఆకాయ్ అని చెబుతున్న చిన్నారి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.    

3 /6

పాపను ఎత్తుకున్నది అనుష్క శర్మ, ఇది చూసిన అభిమానులు పుట్టిన 11 నెలల తర్వాత అకాయ్ ఫోటో వైరల్‌గా మారిందని అంటున్నారు.    

4 /6

అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు పిల్లలను మీడియాకు దూరంగా ఉంచుతున్నారు. ఇప్పటివరకు ఈ జంట తమ పిల్లల ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుష్క, విరాట్ కొడుకు అకాయ్ ఫోటోలు బయటకు వస్తున్నాయి.    

5 /6

ఈ ఏడాది ఫిబ్రవరి 15న అనుష్క, విరాట్‌లు తమ కొడుకు అకై పుట్టిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.   

6 /6

అకాయ్ పుట్టినప్పటి నుంచి లండన్ లోనే ఉంటున్న ఈ జంట ఇక నుంచి అక్కడే సెటిల్ కానుందని చెబుతున్నారు. దీనికి సంబంధించి, అతని చిన్ననాటి కోచ్ కూడా ఇటీవల ఒక ఆశ్చర్యకరమైన ప్రకటన చేశాడు.