AP Rains: ఏపీ వాసులు ఊపిరి పీల్చుకోండి.. తప్పిన తుఫాను ముప్పు..

AP Rains: ఆంధ్ర ప్రదేశ్ వాసులు ఊపిరి పీల్చుకోండి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర అల్ప పీడనంగా బలహీనపడటంతో తుఫాను ముప్పు తప్పినట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తోన్న వర్షాలకు బ్రేక్ పడినట్లైయింది.

1 /5

AP Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడటంతో ఏపీకి పెను తుఫాను ప్రమాదం తప్పినట్టు ఏపీ వాతావరణ కేంద్రం తెలిపింది. అందుకు భూభాగం నుంచి వీస్తున్న పొడిగాలులు ఓ కారణమని తెలిపింది.

2 /5

దీంతో రాష్ట్రానికి వాయుగుండం ముప్పు తప్పినట్లైయంది. అల్పపీడనం ప్రభావంతో సోమవారం వరకు తీరం వెంబడి గంటకు గరిష్ఠంగా 55 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయన్నారు. 

3 /5

రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.సముద్రం అలజడిగా ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ కేంద్ర అధికారులు హెచ్చరికలు జారీ చేసారు.

4 /5

వాయుగుండం ప్రభావంతో శుక్రవారం ఉదయం నుంచి శనివారం మార్నింగ్ వరకు విశాఖపట్నం, పార్వతీపురం మన్యం విజయనగరం, శ్రీకాకుళం,  జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.  

5 /5

నిన్న, మొన్న శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీలు తగ్గాయి. మంగళవారం నుంచి బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ  నిపుణులు అంచనా వేస్తున్నారు.