Kasthuri Shankar controversy: తమిళ వివాదాస్పద నటి కస్తూరీ శంకర్ రచ్చ ఇండస్ట్రీలో పెనుదుమారంగా మారిన విషయం తెలిసిందే. ఆమె తెలుగు వాళ్లను లోకువ చేసి మాట్లాడటం వల్ల వివాదం రాజుకుంది. తాజాగా.. ఆమె జైలు జీవితం గురించి చేసిన వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి.
తమిళ నటి కస్తూరీ తెలుగువారిపై నోరుపారేసుకొవడం ఆమె మెడకు చుట్టుకుందని చెప్పవచ్చు. ఈ ఘటనలో కస్తూరీని పోలీసులు హైదరబాద్ కు వచ్చి మరీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మద్రాస్ కోర్టులో గతంలో ఆమెకు రిలాక్సెషన్ దొరకలేదు. అయితే.. ఆమెను పోలీసులు హైదరబాద్ లో అరెస్ట్ చేసి చెన్నైకి తరలించారు. అప్పట్లో ఈ ఘటన పెను సంచలనంగా మారిందని చెప్పుకొవచ్చు.
కస్తూరీ మాట్లాడుతూ.. తమిళనాడులోని అంతపురంలోని మహిళలకు సేవలు చేయడానికి తెలుగు వారు వచ్చారని నోటికొచ్చినట్లు మాట్లాడారు. కానీ అందులో కొందరు ఇప్పుడు తమిళులుగా చెలమణి అవుతున్నారని ఆమె వ్యాఖ్యలు చేశారు.
దీంతో ఆమెపై పలు పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదయ్యాయి. తెలుగు, తమిళ ప్రజల మధ్య వివాదాలు క్రియేట్ చేసేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని కూడా ఒకవైపు తమిళులు సైతం దీన్ని ఖండించినట్లు తెలుస్తొంది.
మద్రాస్ కోర్టు బెయిల్ తిరస్కరించడంతో ఆమెకు జైలు జీవితం తప్పలేదు. జైలులో ఆమె గడిపిన అనుభవాల్ని ఇటీవల పంచుకున్నారు. తనను జైలులో ఎంట్రీ అయ్యేటప్పుడు.. దుస్తులు లేకుండా చెక్ చేశారని.. ఆమె చెప్పారంట. శరీరంపై ప్రతి ఒక్క పార్ట్ ను తడిమీ మరీ పరిశీలించారని చెప్పుకొచ్చింది.
ప్రైవేటు పార్ట్ లలో కూడా ఏదైన దాచానా.. అన్న విధంగా కూడా చెక్ చేశారని చెప్పినట్లు తెలుస్తొంది. తనకు జైలులో.. 644788798 ఈ నంబర్ ను కేటాయించారని కూడా నటి కస్తూరీ వెల్లడించింది. అయితే.. ఇదంతా జైలు ఫార్మాలిటీస్ ప్రకారం జరిగినట్లు ఆమె చెప్పారని సమాచారం.
కానీ తాను..మొదటి , రెండు రోజులు చాలా ఒత్తిడికి ఫీలయ్యానని, ఆ తర్వాత తనను తాను కంట్రోల్ చేసుకున్నట్లు నటి కస్తూరీ చెప్పుకొచ్చారు. జైలు జీవితం అంత ఈజీకాదన్నారు. జైలులో స్కూల్స్ కూడా ఉందని, డిగ్రీవరకు చదువుకొవచ్చని ఆమె చెప్పారు. జైలులో ద్రవిడియన్ పాలిటిక్స్ పుస్తకాలు చదివానని చెప్పారు. ప్రస్తుతం నటి కస్తూరీ చేసిన వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి.