Weightloss journey: సోషల్ మీడియాలో వెయిట్ లాస్ స్టోరీస్ పంచుకోవడం ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలో..జితిన్ కూడా తన 35 కేజీల వెయిట్ లాస్ ప్రయాణాన్ని సౌత్‌ఇండియన్ డైట్ ప్లాన్ ద్వారా సాధించినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పారు. అతను చెప్పినవ్డైట్ ప్లాన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈమధ్య కాలంలో జీవనశైలి వల్ల ఎక్కువ మంది బరువు పెరిగి, ఆ తర్వాత తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వారిలో ఒకరైన జితిన్ వీఎస్ 105 కేజీల నుండి క్రమంగా 70 కేజీలకు తగ్గి తన ప్రయాణాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.
సౌత్ ఇండియన్ డైట్ ఫాలో అవుతూ బరువు ఎలా తగ్గచ్చో అని డైట్ ప్లాన్ బయట పెట్టారు. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో నిమ్మరసం తాగాలి. బ్రేక్‌ఫాస్ట్ గా కోడిగుడ్లతో పాటు సాంబార్‌తో రెండు ఇడ్లీలు లేదా పెసరపప్పు సలాడ్‌తో దోశ తీసుకోవాలి.
మధ్యాహ్నం బ్రౌన్ రైస్ లేదా చిరుధాన్యాలతో చేసిన అన్నం, సాంబార్, పచ్చికూరలతో పాటు చికెన్ లేదా చేప లాంటి ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. సాయంత్రం సమయానికి తేలికపాటి స్నాక్స్ తినాలి. చక్కెర లేకుండా ఓ కప్పు గ్రీన్ టీ లేదా ఒక కప్పు మసాలా చాయ్ తగచ్చు. 2 ఉడికించిన గుడ్ల వైట్ లేదా ఒక గుప్పెడు వేయించిన శనగలు కూడా తీసుకోవచ్చు.
రాత్రి భోజనానికి చిరుధాన్యాలతో చేసిన దోశ, సూప్, లేదా రాజ్మా కర్రీ తో మల్టీగ్రెయిన్ రోటీ అయినా తినచ్చు. డైట్‌తో పాటు కొన్ని ముఖ్యమైన నియమాలు కూడా పాటించాలి. డీప్ ఫ్రై చేసిన ఆహారాలను పూర్తిగా మానేయాలి.
ప్రతీసారి తిన్నాక 10 నుంచి 15 నిమిషాలు నడవాలి. అప్పుడే జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. రోజంతా హైడ్రేటెడ్‌గా ఉండడానికి ఎక్కువ నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. వంటకాల్లో నెయ్యి, కొబ్బరి నూనె వాడకాన్ని పరిమితం చేయాలి.
జితిన్ ఉపయోగించిన డైట్ ప్లాన్ అతనికి పనికొచ్చింది, కానీ ఇది ప్రతి ఒక్కరికీ అనువుగా ఉండకపోవచ్చు. ఒక్కో వ్యక్తి శారీరక పరిస్థితులు వేరు. అందుకే బరువు తగ్గేందుకు ముందుగా నిపుణుల సలహా తీసుకోవడం అవసరం. జితిన్ పంచుకున్న డైట్ ఇతరులకు మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది.