Rajasthan: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. సీఎన్‌జీ ట్రక్‌ పేలి ఐదుగురి సజీవదహనం, భయానక వీడియో వైరల్‌..

Rajasthan Truck Blast video viral: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కెమికల్‌ ట్రక్‌ పేలి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. 36 మందికిపైగా తీవ్ర గాయాలపాలయ్యారు  

Written by - Renuka Godugu | Last Updated : Dec 20, 2024, 10:14 AM IST
Rajasthan: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. సీఎన్‌జీ ట్రక్‌ పేలి ఐదుగురి సజీవదహనం, భయానక వీడియో వైరల్‌..

   Rajasthan Truck Blast 5 Dead:  రాజస్థాన్‌ జైపూర్‌లో ఈరోజు తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెట్రోల్‌ బంక్ వద్ద ఉన్న కెమికల్‌ ట్రక్ పేలడంతో భారీ ఎత్తున మంటలు చేలరేగాయి. ఈ ఘటనలో దాదాపు 36 మంది తీవ్రగాయాలపాలయ్యారు. చనిపోయిన డెడ్‌ బాడీలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. పదుల సంఖ్యలో వాహనాలు పూర్తిగా కాలిపోయాయి.

పెట్రోల్‌ బంక్‌ వద్దనే ఈ పేలుడు ఘటన జరగడంతో అక్కడ నిలిపి ఉన్న వాహనాలకు కూడా ఈ మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. సీఎం కూడా ఘటనపై ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేశారు.

భంక్రోటా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు కూడా హెల్ప్‌ లైన్ నంబర్లను విడుదల చేశారు. అయితే, ఈ సీఎన్‌జీ ట్రక్‌, ఇంకో ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: తాతా మనవళ్ల సవాల్‌.. ఇంటి నుంచి కట్టుబట్టలతో వెళ్లిపోయిన కార్తీక్‌, బోరున విలపించిన సుమిత్ర..  

ఈ ప్రమాదం పై స్పందించిన ముఖ్యమంత్రి భజన్‌ లాల్‌ విచారణ జరిపి ఘటనపై ఆరా తీస్తామన్నారు. ఈ ప్రమాదం చాలా బాధాకరం, ఆందోళన కలిగిస్తుందని చెప్పారు. తమ బంధువులు ఎవరైనా ఉంటే హెల్ప్ లైన్ ద్వారా తెలుసుకోవచ్చని సమాచారాన్ని పొందవచ్చని వెల్లడించారు.ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న సీఎం భజన్‌ లాల్‌ అక్కడ ప్రమాదంపై ఆరా తీశారు క్షతగాత్రులు వెంటనే కోల్పోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను అన్నారు.ఆస్పత్రిలో చేరిన క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని కోరారు.

ముఖ్యంగా ఈ ఘటన భంక్రోట్‌ లోని అజ్మీర్ హైవేపై జరగడంతో అక్కడ ట్రాఫిక్ కూడా విపరీతంగా పెరిగింది. పోలీసులు దారి మళ్లింపులు ట్రాఫిక్ ని క్లియర్ చేసే పనిలో పడ్డారు. ఇక దగ్ధమైన వాహనాలను నంబర్ ప్లేట్ల ఆధారంగా గుర్తింపు చర్యలు చేపడుతున్నారు.ఈ ఘటనపై పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. 

 

 

ఇదీ చదవండి:  రైతులకి బిగ్ అలెర్ట్.. ఫోన్ స్విచ్ ఆఫ్ పెడితే పీఎం కిసాన్ డబ్బులు పడవు!

ప్రమాదంపై మాజీ సీఎం అశోక్ గెహ్లట్‌ కూడా ఎక్స్‌ వేధికగా సంతాపం తెలియజేశారు. ఈ ఘటన ఆందోళనకరం త్వరగా క్షతగాత్రులు కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నట్టు గెహ్లాట్ పేర్కొన్నారు. ఈ ప్రమాదాన్ని కలెక్టర్ డాక్టర్ జితేంద్ర కుమార్ సోనీ అధికారికంగా ధ్రువీకరించారు. హైవేపై రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలు కూడా త్వరగా కొనసాగుతున్నాయి. హైవే నుంచి వాహనాలు తరలించే పనిలో పోలీసులు రెస్క్యూ టీమ్‌ పడింది. 
అయితే చనిపోయిన మృతదేహాలు గుర్తుపట్టని స్థితిలో పూర్తిగా కాలిపోయాయి. వారిని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. క్షతగాత్రులు కూడా 70 శాతం కాలిపోయిన స్థితిలో ఆసుపత్రికి వచ్చారు అని వైద్యులు చెబుతున్నారు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

  

  

Trending News