Shani Dhaiya 2025: 2025లో ఈ రాశులవారిపై శని ధైయా ఎఫెక్ట్‌.. వీరికి జరగబోయేది పక్కా ఇదే!

Shani Dhaiya 2025 Effect: శని గ్రహాన్ని న్యాయదేవతగా కూడా పిలుస్తారు. ఈ గ్రహం చాలా అరుదుగా ఒక రాశిని వదిలి ఇతర రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే శని గ్రహం అతి త్వరలోనే రాశి సంచారం చేయనుంది. 2025 సంవత్సరంలో కుంభరాశిని వదిలి మీన రాశిలోకి ప్రవేశించబోతోంది. ఎన్నో ఏళ్ల తర్వాత ఈ గ్రహం మీన రాశిలోకి ప్రవేశించబోతోంది. 
 

1 /7

శని గ్రహం మీన రాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశులవారికి ధైయ మొదలవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో సింహ, ధనుస్సు రాశివారు అనేక దుష్ప్రభావాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి.     

2 /7

శని ధైయా సింహ, ధనుస్సు రాశులవారికి రెండున్నర సంవత్సరాలు ఉంటుంది. దీని కారణంగా ఈ రాశులవారు 2 సంవత్సరాల పాటు ఇబ్బందులు పడే ఛాన్స్‌ ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.   

3 /7

ప్రస్తుతం చాలా మందికి శని ధైయా అంటే ఏమిటి? అంటే ఏమిటో తెలియదు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..శని చంద్రుని రాశి నుంచి జాతకంలో నాలుగవ లేదా ఎనిమిదవ స్థానంలోకి ప్రవేశించడం వల్ల శని ధైయా ప్రారంభమవుతుంది. దీని ప్రభావం అప్పటి నుంచి ప్రారంభమవుతుంది.     

4 /7

శని ధైయ ప్రభావం సింహ రాశివారిపైనే కాకుండా ధనుస్సు రాశి వారిపై కూడా పడుతుందని జ్యోతిస్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ రాశివారికి దీర్ఘకాలికంగా బిజినెస్‌లో బిజీ బిజీ ఉన్నవారు ఈ సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు.    

5 /7

అలాగే ధనుస్సు రాశివారి తల్లి ఆరోగ్యం కూడా క్షీణించే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు వీరికి భౌతిక ఆనందం కూడా తొలగిపోతుంది. అలాగే సంపాదనల పరంగా అనేక సమస్యలు వస్తాయి. ఆస్తుల విషయాల్లో గొడవలు కూడా జరుగుతాయి. ఆర్థిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావాలు కూడా ఏర్పడతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.     

6 /7

ఇక సింహ రాశివారికి కూడా ఈ సమయంలో అనేక సమస్యలు రావచ్చని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరికి మానసిక సమస్యలు కూడా దూరమవుతాయి. అలాగే పిల్లల ఆరోగ్యపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో పాటు విద్యార్థులకు ఈ సమయం చాలా ఇబ్బందులు కలుగుతాయి.    

7 /7

సింహ రాశివారికి ప్రేమ జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. దీంతో పాటు భాగస్వామ్య జీవితం కూడా గొడవలు రావచ్చని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ రెండు సంవత్సరాలు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.