Cold Waves Orange Alert In Telangana: చలి చంపేస్తోంది. విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఏడాది డిసెంబర్ నెలలో చలి పెరగడం సాధారణం. కానీ, ఈసారి మరింత చలి పెరిగింది. దీంతో భారత వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ కూడా జారీ చేసింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
చలి తీవ్రత పెరుగుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు కూడా ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ప్రభావం చూపుతోంది. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో నేడు వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరించింది.
గడిచిన కొద్ది రోజులుగా చెదురు ముదురు వర్షాలు పడుతున్నాయి. ఇదిలా ఉండగా తిరుపతిలో కూడా భారీ వర్షాలు నమోదు అయ్యాయి. మరోసారి నేడు, రేపు 17, 18 తేదీల్లో కూడా వర్షాలు పడతాయని ఐఎండీ అలెర్ట్ చేసింది.
ఇక తెలంగాణలో అల్పపీడనం ప్రభావం ఉండదు. కానీ, చలి తీవ్రత పెరిగింది. దీనికి పొగమంచు కూడా తొడవ్వడంతో తీవ్రత పెరిగింది. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో ఐఎండీ ఆరెంజ్ అలెర్ట్ చేసింది.
తెలంగాణలో విజృంభిస్తోన్న చలి నేపథ్యంలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. 5 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతోంది. పగటి ఉష్ణోగ్రతలు కూడా పొడి వాతావరణం కనిపిస్తోంది. రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతోంది.
నేడు, రేపు రెండు రోజులు ఈ చలి తీవ్రత మరింత పెరుగుతోందని భారత వాతావరణ శాఖ హెచ్చరిక చేసింది. ముఖ్యంగా రంగారెడ్డి, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబు నగర్, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ చేసింది ఐఎండీ.
ఇక ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలకు బుధవారం కూడా ఆరెంజ్ అలెర్ట్ చేసింది. మిగతా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఈ ప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.
అంతేకాదు ఉదయం ఆఫీసులు, స్కూళ్లకు వెళ్తున్న వాహనదారులకు కూడా ఐఎండీ హెచ్చరించింది. చలి నేపథ్యంలో వాతావరణంలో విపరీతంగా పొగ మంచు కూడా పేరుకుంది. దీంతో వాహనాలు నడిపేవారు కచ్చితంగా లైట్లు వేసుకోవాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని సూచించింది.