Amit Shah Tour: మావోయిస్ట్ అగ్రనేత ఇంటికి అమిత్ షా.. భద్రతా దళాలకు హోం మంత్రి భరోసా..

Amit Shah Tour: కేంద్ర ప్రభుత్వంలో నెంబర్ టూ హోం మినిష్టర్ మరో సాహసం చేయబోతున్నారు.  మావోయిస్టు అగ్రనేత హిడ్మా స్వగ్రామంలో అమిత్ షా పర్యటించనున్నట్టు తెలుస్తోంది. ఛత్తీస్ గఢ్ పర్యటనలో భాగంగా ఆయన హిడ్మా స్వగ్రామం పువర్తికి వెళ్లనున్నట్టు వార్తలు వస్తున్నాయి.  

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 15, 2024, 02:00 PM IST
Amit Shah Tour: మావోయిస్ట్ అగ్రనేత ఇంటికి అమిత్ షా.. భద్రతా దళాలకు హోం మంత్రి భరోసా..

Amit Shah Tour: కేంద్ర హోం మినిష్టర్ అమిత్ షా మరో సంచలనానికి తెర లేపారు. ఆయన మావోయిస్టు అగ్రనేత సొంత గ్రామంలోపర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులకు గట్టి హెచ్చరికలు పంపించనున్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో దేశంలో చివరి నక్సలైట్స్ ను నిర్మూలించడమే భాగంగా కేంద్రం నడుం బిగించింది. అంతేకాదు గత పదేళ్లలో చాలా రాష్ట్రాల్లో మావోయిస్టులు తుడిచి పెట్టేసారు.

తాజాగా అమిత్ షా పర్యటనతో  కేంద్రం మావోయిస్టులకు గట్టి హెచ్చరికలు జారీ చేయడంతోపాటు...యాంటీ నక్సల్స్‌ ఆపరేషన్లలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న సీఆర్పీఎఫ్, డీఆర్‌జీ, కోబ్రా, ఎస్‌టీఎఫ్, ఐటీబీపీ, బస్తర్‌ ఫైటర్స్‌  దళాల్లో ఆత్మస్థైర్యం నింపడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిస్తోంది.

పువర్తి పర్యటన సందర్భంగా హిడ్మా తల్లితో పాటు ఇతర స్థానికులతో అమిత్‌ షా మాట్లాడనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఛత్తీస్‌గఢ్‌లోని జిల్లా కేంద్రమైన సుక్మా నుంచి 120 కిలోమీటర్ల దూరంలో మడావి హిడ్మా స్వగ్రామం పువర్తి ఉంది. మురియా ఆదివాసీ తెగకు చెందిన హిడ్మా.. 2001లో అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ, బెటాలియన్‌ వన్‌ కమాండర్‌గా ఎదిగారు. పూర్తి అటవీ ప్రాంతం మధ్యలో ఉన్న పువర్తిలో ప్రత్యేక కమ్యూనికేషన్‌ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకున్నారు.

దాదాపు పదేళ్ల ప్రయత్నం తర్వాత 2024 ఫిబ్రవరిలో భద్రతా దళాలు పువర్తికి చేరుకుని క్యాంపు ఏర్పాటు చేయగలిగాయి. దీనితోపాటు దండకారణ్యంలో మావోయిస్టుల కీలక కేంద్రాలైన కొండపల్లి, జీడిపల్లిలోనూ క్యాంపులు ఏర్పాటు చేశాయి. అక్కడి నుంచి చుట్టుపక్కల ప్రాంతాల్లో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు చేపడుతున్నాయి.

ప్రతి గా మావోయిస్టులు కూడా ఈ క్యాంపులపై తరచూ దాడులు చేస్తూ భద్రతా దళాలకు సవాలు విసురుతున్నారు. మరోవైపు భద్రతా దళాలు కూడా ధీటులుగా మావోయిస్టులు దాడి చేస్తే ప్రతి దాడులు చేయడానికి వ్యూహానికి ప్రతి వ్యూహం పన్నుతున్నాయి.  ఇటీవల జీడిపల్లి క్యాంప్‌పై పదిహేను రోజుల వ్యవధిలో రెండుసార్లు చేసిన దాడులకు హిడ్మా నాయకత్వం వహించినట్టు ప్రచారం జరిగింది. ఇలాంటి చోట అమిత్‌ షా పర్యటించనున్నారనే ప్రచారంతో దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఇదీ చదవండి: Nagababu Cabinet: ముగ్గురు మొనగాళ్లు.. దేశంలోనే మొదటిసారి..

ఇదీ చదవండి: ఫామ్ హౌస్ రౌడీ.. ఆది నుంచి మోహన్ బాబు తీరు వివాదాస్పదం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయం

Trending News